అన్వేషించండి

Danam Nagender Disqualification: దానంపై వేటు తీర్పుతో కలకలం.. మరి మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితేంటి? చట్టం ఏం చెబుతోంది?

BRS Defected MLAs Status: దానంపై హైకోర్టు అనర్హత వేటు వేసినందున మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమిటి? పటాన్‌చెరు ఎమ్మెల్యే BRS లోకి రావడం వెనుక కథ ఏంటి? పదో షెడ్యూల్ ఏం చెబుతోంది?

Anti Defection Law 10th Schedule:  తెలంగాణ శాసనసభలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పదో షెడ్యూల్  పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అనర్హత వర్తించేలా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. దానం నాగేందర్ పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవంటూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేయడంతో, గులాబీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌లోకి వెళ్లిన మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా త్వరలోనే ఇదే రీతిలో అనర్హత వేటు పడుతుందని, వారి పదవులు ఊడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా, మీడియా వేదికగా తీవ్ర ప్రచారం చేస్తున్నారు. అయితే, రాజకీయాలు, చట్టపరమైన అంశాలను లోతుగా పరిశీలిస్తే.. దానం నాగేందర్ కేసు పూర్తిగా వేరు, మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి పూర్తిగా వేరు అని స్పష్టమవుతోంది.

దానం నాగేందర్‌ది స్పెషల్ కేసు 

దానం నాగేందర్ చట్టపరమైన ఉచ్చులో చిక్కుకోవడానికి ప్రధాన కారణం ఆయన కాంగ్రెస్ బి-ఫామ్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి అధికారికంగా పోటీ చేయడమే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం.. ఒక పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధి వేరే పార్టీ తరఫున ప్రత్యక్షంగా ఎన్నికల్లో నామినేషన్ వేసి బి-ఫామ్ సమర్పిస్తే, ఆయన తన మాతృక పార్టీ సభ్యత్వాన్ని  స్వచ్ఛందంగా త్యజించినట్లే  పరిగణిస్తారు. దానం నాగేందర్ స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడమే ఆయన ఫిరాయింపునకు తిరుగులేని ఆధారంగా మారింది. ఈ సాంకేతిక విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుని అనర్హత విధించింది.

మిగిలిన ఎమ్మెల్యేలపై ఆధారాల్లేవు!

కానీ, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మిగిలిన ఎమ్మెల్యేల వ్యవహారం దానం కేసు లాంటిది కాదు. వారెవరూ మరో పార్టీ బి-ఫామ్‌పై పోటీ చేయలేదు, అధికారికంగా ఎలాంటి నామినేషన్ దాఖలు చేయలేదు. కేవలం కాంగ్రెస్ నేతలను కలవడం, గులాబీ కండువాలు తీసి కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం లేదా ప్రభుత్వ వేదికలపై కనిపించడం వంటివి కోర్టుల్లో  చట్టబద్ధమైన పార్టీ ఫిరాయింపు కిందకు రావని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు తేల్చిచెప్పాయి. ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్‌లు కోర్టుల్లో నిలబడే ఆధారాలు కావని, అసెంబ్లీ రికార్డుల ప్రకారం వారంతా ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేననే సాంకేతిక వెసులుబాటు వారికి కొండంత అండగా ఉంది.

ఇప్పటికే బీఆర్ఎస్ గూటికి చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే

ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఆ 10 మంది ఎమ్మెల్యేలలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. అనర్హత వేటు ముప్పు, నియోజకవర్గంలో రాజకీయ ఒత్తిళ్లతో  ఆయన తిరిగి సొంత పార్టీ ప్రచారాల్లో, బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మహిపాల్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ క్యాంప్‌లోకి వచ్చేయడంతో, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకత్వం ఇకపై పట్టుబట్టే అవకాశం ఉండదు. ఇక్కడే ఒక పెద్ద రాజకీయ చిక్కుముడి ఏర్పడుతోంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు పిటిషన్లు వేసిన బీఆర్ఎస్, ఇప్పుడు పటాన్‌చెరు ఎమ్మెల్యేను మినహాయించి మిగిలిన 8 మందిపైనే చట్టపోరాటం కొనసాగించాల్సి ఉంటుంది. ఒకరిని వదిలేసి, తమకు నచ్చిన మిగిలిన వారిపై మాత్రమే అనర్హత వేటు వేయాలని పట్టుబడితే.. ఆ పోరాటంలో ఉన్న రాజకీయ సీరియస్‌నెస్ ,  నైతికత దెబ్బతింటుంది.  అందరిపై ఒకే రకమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఒకరిని ఎందుకు మినహాయించారు అనే సాంకేతిక ప్రశ్న ఎదురయ్యే ప్రమాదం ఉంది.

స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు!   

అంతేకాకుండా, స్పీకర్ ట్రైబ్యునల్ పరిధిలోని అధికారాల్లో కోర్టులు నేరుగా జోక్యం చేసుకోవు. దానం నాగేందర్ కేసులో స్పష్టమైన బి-ఫామ్ ఆధారం ఉంది కాబట్టి తీర్పు వేగంగా వచ్చింది. కానీ మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో అలాంటి అధికారిక దస్తావేజులు లేకపోవడంతో, స్పీకర్ ముందు విచారణ ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. ప్రతి కేసునూ వేర్వేరుగా విచారించి ఆధారాలు బేరీజు వేయాల్సి ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ ఎమ్మెల్యేలకు కాలయాపన చేసే వీలును కల్పిస్తోంది.  అందుకే బిఆర్ఎస్ నేతలు మీడియా వేదికగా ఎంత హడావుడి చేస్తున్నప్పటికీ, మిగిలిన ఎమ్మెల్యేలు , కాంగ్రెస్ నాయకత్వం ఈ పరిణామాలను పూర్తిగా లైట్ తీసుకుంటున్నాయి. చట్టంలోని లొసుగులు, కోర్టుల పరిమితులు తమకు అనుకూలంగా ఉన్నాయని భావిస్తుండటంతో.. దానం తీర్పు మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పదవులకు తక్షణమే ఎలాంటి ముప్పు తీసుకురాలేదని న్యాయ  విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Skipped Vijay Tour: తమిళనాడు సీఎం పర్యటనలో కనిపించని డిప్యూటీ సీఎం - పవన్ కళ్యాణ్ ఎందుకు దూరం జరిగారు?
తమిళనాడు సీఎం పర్యటనలో కనిపించని డిప్యూటీ సీఎం - పవన్ కళ్యాణ్ ఎందుకు దూరం జరిగారు?
CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Embed widget