Balineni Vs Damacharla : కూటమిలో బాలినేని ఉక్కపోత ఖాయం - వదిలేది లేదంటున్న దామచర్ల - ఇక దారేది ?
Prakasam Politics : బాలినేని, ఆయన కుమారుడు జనసేనలో చేరినా వదిలేది లేదని దామచర్ల జనార్దన్ ప్రకటించారు. కేసుల భయంతోనే ఆయన పార్టీ మారుతున్నారని మండిపడ్డారు.
Damachrala Janardhan Fires On Balineni SrinivasaReddy : వైఎస్ఆర్‌సీపీని వీడి జనసేన పార్టీలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి .. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గట్టి హెచ్చరికలు పంపారు. కేసుల భయంతోనే ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారని ఆయన కూటమి పార్టీలో చేరినా వదిలేదని స్పష్టం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు చేసిన అవినీతి, అక్రమాలను బయట పెడతామన్నారు. వైసీపీ అధికాంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా అవినీతి చేసి ఇప్పుడు పార్టీ మారి తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
కేసుల భయంతోనే జనసేనలో చేరిక
బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కల్యాణ్ సమక్షంలో గురువారం జనసేనలో చేరబోతున్నారు. ఈ క్రమంలో దామచర్ల ఆంజనేయులు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపుతున్నాయి. గత వారం పవన్ కల్యాణ్‌ను.. బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసిన తర్వాత కూడా దామచర్ల జనార్ధన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా అవినీతిపై చర్యలు తీసుకుని తీరుతారమని స్పష్టం చేశారు. ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని ఇలా రెచ్చగొట్టే మాటలు సరి కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు.
Also Read: బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బాలినేని, దామచర్ల
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. టీడీపీ తరపున దామచర్ల జనార్దన్ పోటీ చేసి విజయం సాధించారు. ఖచ్చితంగా గెలుస్తాననుకున్న బాలినేనికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఈవీఎంలపై కోర్టులకు వెళ్లి పోరాటం చేసినా పార్టీ నుంచి ఎలాంటి మద్దతు రాలేదు. అదే సమయంలో ప్రకాశం జిల్లాలో ఆయన కు ప్రాదాన్యత తగ్గిపోయింది. వైవీ సుుబ్బారెడ్డితో పాటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాలు బలంగా ఉండటంతో.. బాలినేనికి మళ్లీ కీలక బాధ్యతలు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడలేదు. దాంతో ఆయన పార్టీ మారిపోవాలని నిర్ణయంచారు.
ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ చిరకాల ప్రత్యర్థులు ఉన్నారు. 2012 ఉపఎన్నికల నుంచి వీరిద్దరే ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. జగన్ వెంట నడిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బాలినేని .. ఉపఎన్నికల్లో దామచర్ల జనార్ధన్ పై మంచి మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో దామచర్ల గెలిచారు. మళ్లీ 2019లో బాలినేని గెలిచి.. రెండున్నరేళ్ల పాటు మంత్రిగా చేశారు . ఇటీవలి ఎన్నికల్లో దామచర్లనే మరోసారి గెలిచారు. గతంలో ఎప్పుడూ రానంతగా ముఫ్పై నాలుగు వేల ఓట్లమెజార్టీతో దామచర్ల గెలిచారు. అప్పట్నుంచి బాలినేని నియోజకవర్గనికి దూరంగా ఉంటున్నారు.