అన్వేషించండి

Konda Surekha : కొండా సురేఖకు రాజీనామా లేనట్లే - మంత్రికి రేవంత్ భరోసా ?

Telangana : కొండా సురేఖ రాజీనామా ప్రశ్నే లేదని కాంగ్రెస్ తేల్చేసింది. విషయం కోర్టుకు వెళ్లింది కాబట్టి ఇక అక్కడే తేలుతుందని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు.

No Question of Konda Surekha resignation :  తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఓ చిన్న సునామీనే సృష్టించారు. ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా రేగిన దుమారం కొండా సురేఖ కేటీఆర్‌పై చేసే ఆరోపణల క్రమంలో నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో అసలు వివాదం ప్రారంభమయింది. రాజకీయాలతో సంబంధం లేని సినీ కుటుంబాన్ని టార్గెట్ చేయడంపై ఇండస్ట్రీ ఘాటుగా స్పందించింది. అయితే తర్వాత కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. కానీ వివాదం మాత్రం కొనసాగుతోంది. కొండా సురేఖపై నాగార్జున రెండు పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అంశానికి ప్రాధాన్యత లేదని కోర్టుకు చేరిందని ఇక రాజకీయం ఏమీ లేదని కాంగ్రెస్ తేల్చేసోంది. 

కొండా సురేఖతో రాజీనామా చేయిస్తారని ప్రచారం 

కొండా సురేఖతో రాజీనామా చేయించాలని హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు సూచనలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. ప్రియాంకా గాంధీ అక్కినేని అమలతో మాట్లాడారని కూడా చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కొండా సురేఖను రాజీనామా చేయాలని అడిగినట్లుగా లేదని కనీసం మందలించినట్లుగా కానీ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. పైగా కొండా సురేఖ ఒంటరి కాదని ఆమెను అదే పనిగా టార్గెట్ చేస్తే మేమంతా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగానే హెచ్చరికలతో కూడిన ప్రకటనలు చేశారు. ఆ తర్వాత నాగార్జునపై కబ్జా కేసు కూడా నమోదు అయింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే కొండా సురేఖకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచిందని స్పష్టమవుతోదంని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.  

ఐజీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు

కొండా సురేఖకు మద్దతుగానే  రేవంత్ రెడ్డి 

కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా స్పందించలేదు. కానీ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఓ మీడియా సమావేశంలో  పరోక్షంగా స్పందించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కామెడీ చేశారు. పరువు నష్టం దాఖలు చేశారట.. పరువు నష్టం పిటిషన్ అని ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రకారం చూస్తే కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి ఏ మాత్రం అసంతృప్తికి గురి కావడం జరగలేదని ఆమెకు పూర్తి స్థాయిలో సపోర్టుగా ఉన్నారని అర్థమవుతుంది. నిజానికి ఇలాంటి రాజకీయ వివాదాలు వచ్చినప్పుడు సొంత పార్టీ నేతలకు నైతికంగా మద్దతుగా నిలకవకపోతే పార్టీ నేతల్లో స్థైర్యం తగ్గిపోతుంది. తమపై విపక్షాలు ఏదైనా  వివాదాలు సృష్టించినా ఇంతేనా అనుకుంటారు. అదే సమయంలో విపక్ష పార్టీలకు బలం వస్తుంది. అలాంటి వివాదాలను మరిన్ని తెరపైకి తెస్తారు. ఈ రాజకీయంపై రేవంత్ రెడ్డికి స్పష్టత ఉంది కాబట్టి బీఆర్ఎస్ ట్రాప్‌లో పడలేదని చెబుతున్నారు. 

ఐఏఎస్ అమ్రపాలి కాటకు భారీ షాక్ - ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని కేంద్రం ఆదేశాలు !

బీఆర్ఎస్ గుప్పిట్లో నాగార్జున ఉన్నారని కాంగ్రెస్ అభిప్రాయం

నాగార్జున విషయంలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సానుకూల అభిప్రాయం లేదు. బీఆర్ఎస్ నేతలతో  నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగరహస్యం.  ఆయన ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఆర్థిక వనరుల పంపిణీలో ఒక టూల్ అని గట్టిగా నమ్ముతారు. అందుకే కొండా సురేఖ వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పెద్దగా స్పందించలేదు. సురేఖకు నైతిక మద్దతు అందించారు. కొండా సురేఖకు అండగా ఉండటంలో రేవంత్ పర్ ఫెక్ట్ స్ట్రాటజీని పాటించారని కాంగ్రెస్ వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget