News
News
X

Janasena Funds : విరాళాల కోసం జనసేన ప్రత్యేక కార్యక్రమం !

జనసేన కోసం విరాళాల సేకరణ ప్రారంభించారు మెగా బ్రదర్ నాగబాబు. పార్టీకి సంబంధించిన ప్రత్యేకమైన యూపీఐ ఐడీని వెల్లడించారు.

FOLLOW US: 

Janasena Funds :  ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటిగా ఉన్న జనసేన పార్టీ నిధుల సేకరణ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాజకీయం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే జనసేన పార్టీకి పటిష్టమైన ఆర్థిక వనరులు గొప్పగా లేవు. దీంతో వారికి ఉన్న బలం బలగం మొత్తం జనసైనికులే. అందుకే జనసైనికుల సాయంతోనే పార్టీకి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడాలని పార్టీ కీలక నేతలు భావిస్తున్నారు. జనసేనకు విరాళాల సేకరణకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు నాగబాబు. “నా సేన కోసం నా వంతు” అంటూ జనసేన విరాళాల సేకరణ ప్రారంభించారు.

జనసేనకు విరాళాలివ్వాలని నాగబాబు పిలుపు

 నా సేన కోసం నా వంతు కార్యక్రమం’’ నిర్వహణ కోసం 32 మందితో కూడిన కమిటీని నాగబాబు ప్రకటించారు. కమిటీ చైర్మన్ గా బొంగునూరి మహేందర్ రెడ్డి, కన్వీనర్ గా తాళ్లూరి రామ్, కో కన్వీనర్లుగా రుక్మిణీ కోట, టి.సి.వరుణ్, కో ఆర్డినేషన్ కమిటీలో సోషల్ మీడియా విభాగం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఐ.టీ. విభాగం నుంచి పసుపులేటి సంజీవ్, ఎన్.అర్.ఐ. భాస్కర్, సాయి రాజ్ కె., సతీశ్ రెడ్డి, క్రాంతి కిరణ్, పవన్ కిషోర్, గిరిధర్, రవి కుమార్, ఏరియా కో ఆర్డినేటర్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముఖ్యమైన సభ్యులు ఉంటారు.

జనసేనకు మూడున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులు

3.5 లక్షల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, ఐటీ విభాగం, స్వచ్ఛందంగా పని చేస్తున్న సోషల్ మీడియా విభాగం, జనసేన ఎన్.అర్.ఐ. విభాగం, జిల్లా, అసెంబ్లీ, మండల, వార్డు ఇంఛార్జిలు, జనసేన పార్టీ వివిధ అనుబంధ విభాగాలు, వైద్యులు, వ్యాపారస్తులు, వీరమహిళా విభాగం, గృహిణులు, మహిళా ఉద్యోగులు, యువత, విద్యార్థులు, జనసేన పార్టీ శతగ్ని, పార్టీ అధికార ప్రతినిధులు తదితర విభాగాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటారు . జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన 7288040505 @icici అనే UPI ఐడి (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్) ప్రక్రియ ద్వారా చాలా సులభంగా కనీసం రూ.10 నుంచి ఎంత మొత్తాన్నైనా పార్టీకి విరాళంగా అందించవచ్చునని జనసేన ప్రకటించింది.  

సొంత డబ్బులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ 

నిజానికి ఎప్పట్నుంచో జనసేనకు విరాళాలివ్వాలనుకునేవారి ఓ విండో అందుబాటులో ఉంది. దాని ద్వారా నెలవారీ సాయం చేస్తున్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో పార్టీ పరమైన ఖర్చులు పెరిగిపోతాయని.. వాటిని తట్టుకోవాలంటే విరాళాల సేకరణలో జోరు పెంచాలని నిర్ణయించుకున్నారు.  రైతు భరోసా యాత్రకు సొంత డబ్బులే పవన్ ఇస్తున్నారు. కొంత మంది పార్టీ నేతలు విరాళం ఇచ్చినా అది చాలా స్వల్పమే. ఇప్పుడు జనసైనికులు ఎంత మేర అండగా నిలిస్తే.. జనసేనకు అంత ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. అందుకే నా సేన కోసం నా సేవ అనే స్కీమ్ ప్రారంభించారు.  

Published at : 26 Aug 2022 04:16 PM (IST) Tags: Pawan Kalyan Janasena Donations to Janasena

సంబంధిత కథనాలు

KCR National Politics :  దేశమంతా చర్చించుకునేలా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన -  అంచనాలకు అందని విధంగా పబ్లిసిటీ ప్లాన్ !

KCR National Politics : దేశమంతా చర్చించుకునేలా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన - అంచనాలకు అందని విధంగా పబ్లిసిటీ ప్లాన్ !

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

TDP Twitter Hack : టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - ఇప్పుడు అందులో ఏం పోస్టులు ఉన్నాయంటే ?

TDP Twitter Hack : టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - ఇప్పుడు అందులో ఏం పోస్టులు ఉన్నాయంటే ?

YSRCP Vs TRS : ఆల్ ఈజ్ నాట్ వెల్ - టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ మధ్య ఏం జరుగుతోంది ?

YSRCP Vs TRS :   ఆల్ ఈజ్ నాట్ వెల్  -  టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ మధ్య ఏం జరుగుతోంది ?

టాప్ స్టోరీస్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Horoscope Today 2nd October 2022: ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది- వీరిపై సరస్వతీ కటాక్షం ఉంటుంది, అక్టోబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd October 2022: ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది- వీరిపై సరస్వతీ కటాక్షం ఉంటుంది, అక్టోబరు 2 రాశిఫలాలు

Priya Prakash Varrier: వింకీ బ్యూటీ రీసెంట్ పిక్స్

Priya Prakash Varrier:  వింకీ బ్యూటీ రీసెంట్ పిక్స్