Fact Check CM Jagan : నోట్ల ముద్రణపై జగన్ చేసిన వ్యాఖ్యలు నిజమైనవేనా ? ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఏం చెబుతోందంటే ?
నోట్ల ముద్రణపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఫ్యాక్ట్ చెక్ ఏపీ స్పందించింది.
Fact Check CM Jagan : డబ్బులు ప్రింట్ చేసే కేంద్రం వద్దే డబ్బు లేదంటే ఎలా అని సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో అన్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఈ వీడియోను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ ముఖ్యమంత్రిగా ఉండి నోట్లు ఎప్పుడు ముద్రిస్తారో కూడా తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ వివరణ ఇచ్చారు. ఓ చిన్న ఎడిటెడ్ క్లిప్ మాత్రమే సీఎం జగన్ మాట్లాడిన దానికి సంబంధించి ప్రదర్శిస్తున్నారని కానీ పూర్తి మొత్తం చూడాలని ఫ్యాక్ట్ చెక్ ఏపీ సూచించింది.
The trimmed video is misleading and out of context. Please find the full video for your referral.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 28, 2022
During the conversation with tribal women from the Polavaram area, Hon'ble CM sir explained the way R&R act (Rehabilitation and Resettlement Act, 2013) works, in simple words. 1/2 https://t.co/N5C4Ya8NCU pic.twitter.com/zLwoCMwR6H
కేంద్రం కంటే మెరుగ్గా ఏపీ ఆర్థిక పరిస్థితి - లెక్కలు రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు !
ఆ మేరకు సీఎం జగన్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. మొత్తం చూసిన తర్వాత సీఎం జగన్ ఏ ఉద్దేశంతో అలా అన్నారో తెలుసుకోవాలని సూచించింది. పోలవరం నిర్వాసితులకు అర్థమయ్యేలా చాలా సింపుల్ వర్డ్స్‌తో సీఎంజగన్ అలా వ్యాఖ్యానించారని తెలిపింది.
As a responsible news outlet, please verify videos before tweeting. The edited video even has a logo pasted over another logo, kindly refrain from promoting misleading videos. @TeluguBulletin
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 28, 2022
2/2
సీఎం జగన్ దెబ్బకి హడలిపోయిన వైసీపీ ఎమ్మెల్యే, గడప గడపకు భారీ హంగామా !
అయితే ఫ్యాక్ట్ చెక్ ఏపీ ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసిన వీడియోలనూ సీఎం జగన్ అదే చెప్పారు. అయితే జగన్ ఏ ఉద్దేశంతో చెప్పారో తెలుసుకోవాలని ఫ్యాక్ట్ చెక్ నిర్వాహకులు చెబుతున్నారు.