By: ABP Desam | Updated at : 09 Feb 2023 06:20 AM (IST)
లోకేష్ పాదయాత్ర - పవన్ వారాహి యాత్ర ! వారికి కౌంటర్‌గా జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే
Jagan Campaign : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగడానికి ఇంకా 14 నెలలకుపైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగిపోయాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు... ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని "ఏపీకి ఇదేం ఖర్మ" పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు జనసేనాని పవన్ కల్యాణ్ త్వరలో వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అందరూ ప్రజల్లోకి వెళ్తూంటే.. మరి వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ ఎలాంటి ప్రచార వ్యూహం అవలంభించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు జగన్ కూడా ఫైనల్ చేసుకున్నారని.. ఏప్రిల్ నుంచి రంగంలోకి దిగుతారని అంటున్నారు. ఇంతకూ జగన్ ఏం చేయబోతున్నారంటే ?
బస్సు యాత్రలు - పల్లె నిద్రలు
అసెంబ్లి బడ్జెట్ సమావేశాల తరువాత సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించాలని అనుకుంటున్నారు. బస్సు యాత్రలోనే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తున్నారు. ఆదిశగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. అసెంబ్లి సమావేశాల తరువాత రూట్‌మ్యాప్ కూడా ఖరారు చేయనున్నారు. వీటికంటే ముందుగా మరో వినూత్న కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనెల 11 నుండి సంక్షేమ ఫలాలు అందుతున్న ప్రతి ఇంటికీ ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అనే నినాదంతో స్టిక్కర్లను అంటించనున్నారు. పై మూడు కార్యక్రమాలను నిర్వహించి ప్రజలతో మరింత మమేకం కావాలని సీఎం జగన్ యోచిస్తూ ఆదిశగా అడుగులు వేయబోతున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
చివరి ఆరేడు నెలలు ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ !
ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు వివిధ కార్యక్రమాల పేరుతో నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అందులో భాగంగానే టీడీపీ యువగళం పేరుతో లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. మరోవైపు జనసేన అధినేత కూడా త్వరలో వారాహి యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటికే నవరత్నాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు అవసరమైన సంక్షేమ ఫలాలను అందిస్తున్న సీఎం జగన్ ఇప్పటివరకూ ప్రజలకు అందిన పథకాల గురించి వివరించేందుకు పల్లె నిద్ర బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో పర్యటిస్తూ ప్రతి రోజూ ఏదో ఒక గ్రామంలో పల్లె నిద్ర చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పల్లె నిద్ర చేసే సందర్భంలో రచ్చబండ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. గతంలోనే రచ్చబండ నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కోవిడ్ తదితర కారణాలవల్ల రచ్చబండ కార్యక్రమం కొంత జాప్యం జరిగింది. చివరి ఆరేడు నెలలు ప్రజల్లో ఉండేలా జగన్ కార్యక్రమాలు ఖరారవుతాయి.
వై నాట్ 175 లక్ష్యంతో రంగంలోకి !
2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయం సొంతంచేసుకున్న జగన్ వచ్చే ఎన్నికల్లో కూడా మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రతి ఎమ్మెల్యేను గడప గడపకు వెళ్లమని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. గత ఏడాది మే 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్ షాపును నిర్వహించి ఎమ్మెల్యేల పనితీరును వివరిస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తూ నిరంతరం ఎమ్మెల్యేలను ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మొత్తంగా ఏపీలో ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలూ సమాయత్తమయ్యాయి. రంగంలోకి దిగిపోాయి. చివరి ఆరేడు నెలలు నేతలంతా రోడ్లపైనే కనిపించనున్నారు.
TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?
YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
AP MLC Elections : ఒక్క ఓటుతో జాతకాల తారుమారు - ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ !
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన
Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు
TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!
TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు