అన్వేషించండి

YSRCP News: ఎట్టకేలకు జగన్ ను కలిసిన బాలినేని- రెండు ఆప్షన్లు ఇచ్చిన సీఎం- మాగుంటకు నో టికెట్

YSRCP 4th List: పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ల నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మూడు జాబితాల్లో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు.

Balineni Met With Jagan : పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జులు మార్పులతో సీఎం జగన్‌ నాలుగో జాబితా సిద్ధం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్న సీఎం జగన్‌...టికెట్ల కేటాయింపులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. మూడు జాబితాలను రిలీజ్ చేసిన  చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నారు. సర్వేల్లో రిపోర్టులు అనుకూలంగా లేకపోతే...ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గెలిచే వారికే టికెట్‌ అని చెప్పేస్తున్నారు.  అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రత్యర్థులు ఎత్తులు చిత్తయ్యేలా...కూటమికి ఝలక్‌ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా...మంత్రులయినా...మాజీ మంత్రులైనా...ఎంపీలయినా సరే...దుకాణం సర్దుకోవాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి దించితే గెలుస్తున్నారా లేదా అన్న దానికే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

తాడేపల్లికి జగ్గిరెడ్డి, గోపిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి 

పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ల నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మూడు జాబితాల్లో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. నాలుగో లిస్టును ఎంత మందికి సీట్లు ఖరారు చేస్తారు ? సిట్టింగ్ లు ఎంత మందికి టికెట్ ఇస్తారు ? కొత్త వారికి ఏ యే నియోజకవర్గాల్లో బరిలోకి దించుతారు ? ఇంకెంత మంది టికెట్లు గల్లంతు అవుతాయోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, నేతల తాడేపల్లి క్యాంపు కార్యాలయం సీఎంవోకు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి, శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, క్యాంపు కార్యాలయానికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డితో మంతనాలు జరిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యేలతో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై చర్చించారు.

ఎట్టకేలకు బాలినేనికి జగన్ అపాయింట్ మెంట్
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డికి జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. సీఎంవో సహా ముఖ్యనేతల సంప్రదింపులతో ఎట్టకేలకు బాలినేని తాడేపల్లికి వచ్చారు. తొలుత ధనుంజయరెడ్డి, ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. అనంతరం సీఎం జగన్‌ని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రకాశం జిల్లాలో తనకు చెప్పకుండా పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చడంపై బాలినేని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గిద్దలూరు, దర్శి, కొండేపి ఇంఛార్జుల నియామకం విషయంలో  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. తన నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా జిల్లాలో ఎవరికీ అందుబాటులోకి రాకుండా హైదరాబాద్‌కి వెళ్లారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపురావడంతో జగన్ తో సమావేశం అయ్యారు. 

అయితే మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పేసినట్టు టాక్. బాలినేనికి రెండు ఆప్షన్లు కూడా ఇచ్చారట. ఒంగోలు నుంచి పోటీ చేస్తారా.. గిద్దలూరు వెళ్తారో తేల్చోవాలని చెప్పారని తెలుస్తోంది. అయితే తన నియోజకవర్గంలో ఇంటి సమస్య తీర్చినట్టైతే పోటీపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారని చెప్పుకుంటున్నారు. అధికారులతో మాట్లాడి ఖర్చుపై చర్చించి నిర్ణయం చెబుతామని జగన్ సమాధానం ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్‌ స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget