News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chandrababu Naidu: అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ బ్లాక్‌ మెయిల్‌ పాలిటిక్స్, ఎక్కడికక్కడ విధ్వంసం- చంద్రబాబు

Chandrababu Naidu: సీఎం జగన్‌ పని అయిపోయిందని, మరో ఆరు నెలల్లో ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

FOLLOW US: 
Share:

Chandrababu Naidu: సీఎం జగన్‌ పని అయిపోయిందని, మరో ఆరు నెలల్లో ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు సర్వేలతో వైసీపీ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. రాజకీయ కక్ష సాధిస్తూ ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

2024 ఎన్నికల్లో వైసీపీ వంద శాతం చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  జగన్‌ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందన్నారు. జగన్‌ను భరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని, వైసీపీ పతనం అనే స్ర్కిప్ట్‌‌ను దేవుడు  తిరగరాశాడని అన్నారు. ప్రజల్లో మమేకమై వైసీపీ ఆగడాలు అరికడదామని నేతలకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓటర్లు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. ఇండియాటుడే సీ ఓటర్‌ సర్వే ప్రకారం 2024 ఎన్నికల్లో టీడీపీకి 15 ఎంపీ స్థానాలు రావడం ఖాయమన్నారు. టీడీపీ హాయంలో సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని, ఈ నాలుగున్నర ఏళ్లలో ప్రజలు ఏం నష్టపోయారో చెప్పాలన్నారు.

వైసీపీ శ్రేణులే దాడులకు చేసి, తిరిగి టీడీపీ శ్రేణులపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. అంగళ్లు, పుంగనూరుల్లో తనను అడ్డుకుని దాడి చేసేందుకు యత్నించారని, దాడులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టారని అన్నారు. సెప్టెంబర్ 1 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. రాబోయే 45 రోజుల పాటు మూడు దశల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. బూత్ ల వారీగా రోజుకు 10 ఇళ్ల చొప్పున నేతలు వెళ్లాల్సి ఉంటుందన్నారు. యూనిట్, క్లష్టర్ల వారీగా కార్యక్రమం పూర్తవుతందన్నారు.

ప్రజా వేదిక కార్యక్రమం ద్వారా యూనిట్ వారీగా ముఖ్యమైన పంచాయతీల్లో పాదయాత్ర చేసి డోర్ టు డోర్ క్యాంపెయన్, బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు భరోసా కింద ఏం చేయబోతున్నామో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపై ఉందన్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల తరహాలో కొత్త కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. తాను కూడా 30 నియోజకర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఆరేడు నెలల్లో ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో ఓటర్లలో 75 శాతం మంది అంటే మూడు కోట్ల మంది ఓటర్లను కలవాలన్నారు. ఎన్నికల నాటికి 100 శాతం కలవగలిగితే గెలుపు సులువు అవుతుందన్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా టీడీపీతో కలిసి నడవాలన్నారు. ‘నిన్నిక భరించలేం.. బై బై జగన్‌’ ఇదే అందరి నినాదం కావాలన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఎల్లుండి నుంచి ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు. జగన్‌, పెద్దిరెడ్డి, జే-గ్యాంగ్‌  రూ.40వేల కోట్ల విలువైన ఇసుక దోచేశారని ఆరోపించారు. 98శాతం హామీలు అమలు చేశామంటూ వైసీపీ అబద్దాలు చెబుతోందన్నారు. టీటీడీ బోర్డు సభ్యులుగా నేరగాళ్లకు స్థానం కల్పిస్తారా అంటూ నిలదీశారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. ‘బాబు భరోసా.. భవిష్యత్తుకు గ్యారెంటీ.. అనేదే తమ నినాదం’ అని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Published at : 26 Aug 2023 09:18 PM (IST) Tags: Chandrababu Naidu New Campaign New Slogan Babu Bharosa Bhavishyathu Guarantee

ఇవి కూడా చూడండి

PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ

PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ

KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్‌ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు అర్థమేంటి!

KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్‌ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు అర్థమేంటి!

BRS On Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుపై ఎక్కువగా బాధపడుతున్న బీఆర్ఎస్ - హఠాత్తుగా మార్పు ఎందుకు ?

BRS On Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుపై ఎక్కువగా బాధపడుతున్న బీఆర్ఎస్ - హఠాత్తుగా మార్పు ఎందుకు ?

Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

Chandrababu Naidu Arrest :  బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ  -   కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

టాప్ స్టోరీస్

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'