అన్వేషించండి

TDP Workshop : టీడీపీ అభ్యర్థులకు 23న వర్క్ షాప్ - ఎలక్షనీరింగ్ పై ప్రత్యేక జాగ్రత్తలు చెప్పనున్న చంద్రబాబు!

Andhra : వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. 2౩న ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వర్క్ షాప్ జరుగుతుంది.

Workshop for the TDP candidates  :  తెలుగుదేశం పార్టీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది.  ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారు.   ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతుంది.  అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వారు ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌, పొలిటికల్‌ మేనేజర్‌, మీడియా మేనేజర్‌, సోషల్‌ మీడియా మేనేజర్లను  వర్క్ షాప్‌నకు పిలిచారు. 

ఒక్కో అభ్యర్థి నలుగురు మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన  టీడీపీ హైకమాండ్                          

టీడీపీ అభ్యర్థులు ఒక్కొకరు నలుగురు మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని అధిష్టానం ఇప్పటికే సూచించింది.  అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌, పొలిటికల్‌ మేనేజర్‌, మీడియా మేనేజర్‌, సోషల్‌ మీడియా మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని నిరంతరం వారి నుంచి పార్టీ కార్యాలయం ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందని గతంలోనే చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన ఆదేశాల మేరకు వారందర్నీ నియమించుకున్నారు అభ్యర్థులు. ఇప్పుడు అభ్యర్థుల్ని వారి మేనేజర్లందర్నీ వర్క్ షాప్ కి పిలుస్తున్నారు. రాబోయే 2 నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్‌షాప్‌లో వారికి అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది.

వైసీపీ అభ్యర్థులకు ఐ ప్యాక్ - టీడీపీకి చంద్రబాబు నేతృత్వంలో వర్క్ షాప్                              

ఇటీవలి కాలంలో రాజకీయ ప్రచార శైలి మారిపోయింది. వైసీపీ అభ్యర్థులకు సంబంధించిన ప్రతీ విషయం ఐ ప్యాక్ బృందం చూసుకుంటూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్ ఉన్నప్పటికీ అభ్యర్థులపై పూర్తి స్థాయి పెత్తనం ఇవ్వలేదు. నియోజకవర్గాల పరిస్థితుల్ని బట్టి వారే నియమించుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో.. అలా నియమించుకున్న  వారందరికీ టీడీపీ హైకమాండ్ శిక్షణ ఇస్తోంది. 

రెండు రోజుల్లో పెండింగ్ ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన                                           

లోక్‌సభ అభ్యర్థులతో పాటు, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.  ఆ జాబితాల్ని గురు లేదా శుక్రవారాల్లో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు.  26 నుంచి ‘ప్రజాగళం’ పేరుతో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. రోజుకో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పర్యటన ఉంటుంది.  ఉదయం ఒక శాసనసభ నియోజకవర్గంలో 10 వేల మందితో ప్రజాగళం సభ జరుగుతుంది.   మధ్యాహ్నం 4.30 గంటలకు ఒక నియోజకవర్గంలో, రాత్రి 7.30కు మరో నియోజకవర్గంలో రోడ్డుషో నిర్వహిస్తారు.  26 నుంచి సుమారు 20 రోజులపాటు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget