అన్వేషించండి

TDP leaders protest: 'నిజం గెలవాలి' కళ్లకు గంతలు కట్టుకొని టీడీపీ శ్రేణులు నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా, ఆయనకు మద్దతు తెలుపుతూ ' కళ్ళు తెరిపిద్దాం' అనే పేరుతో ఆ పార్టీ మరో కార్యక్రమాన్ని నిర్వహించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా, ఆయనకు మద్దతు తెలుపుతూ ' కళ్ళు తెరిపిద్దాం' అనే పేరుతో ఆ పార్టీ మరో కార్యక్రమాన్ని నిర్వహించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపుమేరకు తెలుగు రాష్ట్రాల్లోని చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు ఈ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇవాళ 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు జగన్ పాలనకు వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకొని 'నిజం గెలవాలి' అని గట్టిగా నినాదాలు చేశారు. దీని వీడియో తీసి ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్, ఇంస్టాగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 

విదేశాల్లోని తెలుగువారు సైతం భారత కాలమాను ప్రకారం ఆ సమయంలో నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేసిన 'మోత మోగిద్దాం', 'కాంతితో క్రాంతి', 'న్యాయానికి సంకెళ్లు', 'మనం చేద్దాం జగనాసుర దహనం' కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని టీడీపీ నేతలు తెలిపారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవనం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నక్క ఆనందబాబు, బోండా ఉమ తదితరులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. 

చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. ప్రతీ ఆదివారం వినూత్న నిరసనలకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ప్రతీ ఆదివారం సాయత్రం ఏడు గంటలకు వినూత్న నిరసనలను టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.  ఆదివారం కూడా నిజం గెలవాలి... చంద్రబాబు గారికి వేసిన సంకెళ్లు బద్దలు కావాలని.. అది జరగాలంటే జగనాసురునికి కనువిప్పు కావాలని కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు కళ్ళకు గంతలు కట్టుకొని వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి చంద్రబాబుగారికి మద్దతుగా "నిజం గెలవాలి" గట్టిగా అరుద్దామని టీడీపీ పిలుపు ఇవ్వడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది.

చంద్రబాబు అరెస్ట్ పై ప్రతి ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న నిరసనలు వినూత్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టుపై మహిళలు, యువతలో నిరసన అధికంగా ఉందని, వీరు బయటకు రావడం వల్లే ఈ కార్యక్రమాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయని టీీపీ ్ంటున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ అనేక సందర్భాల్లో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. వీటిలో పార్టీ నేతలు, స్థానికంగా చురుగ్గా ఉండే కార్యకర్తలే తరచూ పాల్గొంటున్నారు. కాని చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ వాతావరణం మారిందని సామాన్యప్రజలు పాల్గొంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఇచ్చే పిలుపుతో వేల మంది చంద్రబాబుకు సంఘిభావం తెలియచేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు అరెస్టు అయ్యి ఇప్పటికి 50 రోజులైనా టీడీపీ శ్రేణులు నిరసనల్లో విశ్రమించలేదు. రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నారు.

టీడీపీ పిలుపునిచ్చే కార్యక్రమాలన్నింటినీ సోషల్ మీడియాలో సీనియర్ నేతలందరూ ప్రచారం కల్పిస్తున్నారు.  రాష్ట్ర నేతల పిలుపుమేరకు ఎక్కడకక్కడ తమ నిరసనను వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీష్ సమేతంగా కళ్లకు గంతలు కట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget