News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TDP Leaders House Arrest: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ పోలీసుల అప్రమత్తత- నిర్బంధంలో నేతలు- డిపోల్లోనే ఆర్టీసీ బస్‌లు

TDP Leaders House Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

TDP Leaders House Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వేకువజామున అరెస్టు చేశారు. అనంతపురం, కర్నూలు, కడప నుంచి వచ్చిన బెటాలియన్లు చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్‌కు చేరుకొని నోటీసులు అందజేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్య నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు. 

శ్రీకాకుళంలో టీడీపీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు హస్ అరెస్ట్ చేశారు. అలాగే విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబును ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. ఇచ్చాపురంలో ఎమ్మెల్యే అశోక్, విజయవాడలో దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు, రాజాంలో కళా వెంకట్రావు, గుడివాడలో వెనిగండ్ల రాము ఇంటికి వెళ్లిన పోలీసులు వారు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అలాగే బోడే ప్రసాద్‌ను  గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించారు.

అనంతపురం జిల్లా కేంద్రంలో టీడీపీ నాయకుడు మారుతి చౌదరి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై శాంతియుతంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నెల్లూరులో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

విజయవాడలో ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉమా ఇంటికి వెళ్లే దారిని బారికేడ్లు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో బారికేడ్లతో వారిని అడ్డుకునేందుకు విజయవాడ పోలీసులు యత్నిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

తిరుపతి జిల్లా సత్యవేడులో టీడీపీ శ్రేణులు ధర్నా  నిర్వహించాయి. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. నగరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌ను పోలీసులు ఇంట్లోనే నిర్బంధించారు. అలాగే నగరిలోనే టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మీరాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి నువ్వుల రామకృష్ణను కండలేరు పోలీసులు నిర్బంధించారు. 

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎన్ఎస్ గేట్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత నిరసన తెలిపారు.  చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నేతలతో కలిసి నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఎట్టకేలకు పరిటాల సునీతను పోలీసులు అరెస్ట్ చేసి ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.   

బాపట్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగంలోకి దిగిన ఎస్పీ వకుల్ జిందాల్ టీడీనీ  నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో రేంజ్ పరిధిలోని పరిస్థితులను ఐజీ పల్ రాజ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్రజస్వామికం అని, ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ తెలిపారు.

 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. తన నివాసం లోపలికి పోలీసులు రావడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసం గేటు బయట ఉండాల్సిన పోలీసులు లోపలికి రావడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన ఇంట్లోకి వస్తే పోలీస్లు అధికారి కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీసం నోటీసు లేకుండా పోలీసులు తన నివాసంలోకి ఎలా కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నివాసం వద్దకు మరింత పోలీసు సిబ్బంది తరలించారు. కోటం రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్
చంద్రబాబు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏపీ ఆర్టీసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టీడీపీ శ్రేణులు చేపట్టే ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో బస్సులను డిపోలకే పరిమితం చేశారు.

Published at : 09 Sep 2023 09:31 AM (IST) Tags: house arrest tdp leaders protest AP Police TDP Leaders Chandrababu Naidu Arrest

ఇవి కూడా చూడండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

MP Elections 2023: ఇక మహిళలను విడదీయాలని ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

MP Elections 2023: ఇక మహిళలను విడదీయాలని ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

JC Prabhakar: తాడిపత్రిలో ఉద్రిక్తం-జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహనిర్బంధం

JC Prabhakar: తాడిపత్రిలో ఉద్రిక్తం-జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహనిర్బంధం

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?  నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!