అన్వేషించండి

BRS defected 9 MLAs disqualification: దానంపై వేటు.. మరి మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి? బిఆర్ఎస్‌కు పటాన్‌చెరు చిక్కుముడి!

Danam Nagender: దానం అనర్హత తీర్పు తర్వాత మిగిలిన 9 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనా వేటు వేయించగలుగుతుందా? పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లిపోవడం మిగిలిన వారికి సేఫ్ కానుందా?

Patancheru MLA Gudem Mahipal Reddy return to BRS:   ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ అనర్హత వేటు వేయడంతో, కాంగ్రెస్ వైపు వెళ్లిన మిగిలిన 9 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దానం కేసులో ఆయన నేరుగా కాంగ్రెస్ బి-ఫామ్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడమనే తిరుగులేని ఆధారం ఉంది కాబట్టి కోర్టు వేటు వేసింది. అయితే, ఈ తీర్పును ఆసరాగా చేసుకుని మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయించాలని బిఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ, చట్టపరంగా, వ్యూహాత్మకంగా బిఆర్ఎస్‌కు ఒక పెద్ద పటాన్‌చెరు చిక్కుముడి ఎదురవుతోంది.

రివర్స్‌లో బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయిన గూడెం      

దీనికి ప్రధాన కారణం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారమే. ఇతర ఎమ్మెల్యేల తరహాలోనే ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం, కాంగ్రెస్ అంతర్గత సమావేశాలకు హాజరుకావడం వంటివి జరిగాయి. అయితే, క్షేత్రస్థాయి సమీకరణాలు మారడంతో ఆయన తిరిగి బిఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ నేతృత్వంలో జరిగిన బిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాలకు హాజరవ్వడమే కాకుండా, బిఆర్ఎస్ నిర్వహించిన ధర్నాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. గులాబీ పార్టీ కూడా ఆయనను అధికారికంగా తమ ఎమ్మెల్యేగానే మళ్లీ సొంతం చేసుకుంది.

అనర్హత కోసం ప్రయత్నిస్తే 9 మందిపైనా ప్రయత్నించాలి!   

ఇక్కడే బిఆర్ఎస్‌కు అసలైన పొలిటికల్ అండ్ లీగల్ డోలాయమానం ఏర్పడింది. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై కోర్టుకు లేదా స్పీకర్ వద్దకు వెళ్లాలంటే.. బిఆర్ఎస్ అందరిపై ఒకే రకమైన పిటిషన్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మహిపాల్ రెడ్డిని మినహాయించి కేవలం మిగిలిన 8 మంది లేదా 9 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే చర్యలు తీసుకోవాలని పట్టుబడితే.. న్యాయస్థానాల్లో బిఆర్ఎస్ వాదనలో ఉన్న  సీరియస్‌నెస్  దెబ్బతింటుంది.  ఒకే రకమైన ఆరోపణలు ఉన్నప్పుడు మీ పార్టీలోకి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేను ఎందుకు మినహాయించారు అనే ప్రశ్న ఎదురైతే బిఆర్ఎస్ నైతిక, చట్టపరమైన నిలకడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాగని తమ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న మహిపాల్ రెడ్డిపై కూడా అనర్హత పిటిషన్‌ను కొనసాగించడం బిఆర్ఎస్‌కు సాధ్యం కాని పని. దీంతో మహిపాల్ రెడ్డి విషయాన్ని పక్కనపెట్టి మిగిలిన వారిపై పోరాడటం బిఆర్ఎస్‌కు ఒక రకమైన సెల్ఫ్‌గోల్‌గా మారే ప్రమాదం ఉంది. ఈ చిక్కుముడిని అధికార కాంగ్రెస్ పార్టీ మరియు సదరు ఎమ్మెల్యేల న్యాయవాదులు కోర్టుల ముందు ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం పుష్కలంగా ఉంది.

మిగిలిన ఎమ్మెల్యేలపై దానం తరహాలో ఆధారాల్లేవు!

 దానం నాగేందర్ కేసు లాగా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి బి-ఫామ్‌లు కానీ, ప్రత్యక్ష నామినేషన్ ఆధారాలు కానీ లేవు. ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్‌లు, కండువాలు కప్పుకోవడాలు చట్టబద్ధమైన పార్టీ ఫిరాయింపు కిందకు రావని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక రికార్డుల్లో వారంతా ఇప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు కాబట్టి, స్పీకర్ ముందు ఈ విచారణ సుదీర్ఘ కాలయాపనకు దారితీస్తుంది. మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ రికార్డుల్లో బిఆర్ఎస్ సభ్యులుగా, బయట మాత్రం కాంగ్రెస్ నాయకులుగా తమ మిగిలిన ఐదేళ్ల కాలాన్ని హాయిగా వెళ్లదీసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. మహిపాల్ రెడ్డి తిరోగమనంతో బిఆర్ఎస్ ప్రతిపాదించిన సమగ్ర అనర్హత పోరాటం నీరుగారిపోయిందని, మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల పదవులకు తక్షణమే ఎలాంటి ముప్పు లేదని ఓ అంచనాకు వచ్చారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
UP Elections Hyderabadi Biryani Row: యూపీ రాజకీయాల్లో హైదరాబాద్ బిర్యానీ మంటలు.. అజంఖాన్‌కు ఒవైసీ దిమ్మతిరిగే కౌంటర్! అఖిలేష్ యాదవ్‌కు కొత్త తలనొప్పి!
యూపీ రాజకీయాల్లో హైదరాబాద్ బిర్యానీ మంటలు.. అజంఖాన్‌కు ఒవైసీ దిమ్మతిరిగే కౌంటర్! అఖిలేష్ యాదవ్‌కు కొత్త తలనొప్పి!
Kota Rukmini vs YSRCP: పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టబోయి వైసీపీ సెల్ఫ్ గోల్ - కోట రుక్మిణి న్యాయపోరాటంతో ప్రతిపక్షం సైలెంట్ అయిపోయిందా?
పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టబోయి వైసీపీ సెల్ఫ్ గోల్ - కోట రుక్మిణి న్యాయపోరాటంతో ప్రతిపక్షం సైలెంట్ అయిపోయిందా?
Telangana Congress 90 Seats Target: కోటి ఓట్లు.. 90 సీట్లు నినాదంతో కాంగ్రెస్ భారీ వ్యూహం.. గతంలో
కోటి ఓట్లు.. 90 సీట్లు నినాదంతో కాంగ్రెస్ భారీ వ్యూహం.. గతంలో "సౌ పార్" అన్న బీఆర్ఎస్ గతేమైంది? క్షేత్రస్థాయి వాస్తవాలు ఇవీ!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget