By: ABP Desam | Updated at : 22 Jan 2023 07:00 AM (IST)
బండి సంజయ్‌కే హైకమాండ్ భరోసా
TS BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని మారుస్తారంటూ కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ ను కేంద్రమంత్రిని చేస్తారని.. ఓ బలమైన వలస నేతకు అధ్యక్ష పదవి ఇస్తారని బీజేపీ వర్గాలే విస్తృతంగా ప్రచారం చేశాయి. దానికి తగ్గట్లుగా బండి సంజయ్ గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. కేంద్ర పెద్దలతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. హైకమాండ్ నేతలు ఆయనకు చెప్పాల్సినదంతా చెప్పి.. పంపినట్లుగా చెబుతున్నారు. ఎన్నికలు ఆయన నేతృత్వంలోనే జరుగుతానయి భరోసా ఇచ్చి పంపించారని అంటున్నారు.
బండి సంజయ ను కొనసాగించే యోచనలో హైకమాండ్ !
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌నే మరో మారు కొనసాగించాలని ఆ పార్టీ అధిష్టా నం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ కాలం ముగు స్తోంది. ఇదే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లి సాధారణ ఎన్నికలుండడంతో పార్టీ అధ్య క్షుడిని మార్చడం సానుకూల పరిణామం కాదని బీజేపీ అధిష్టానంగా బలంగా విశ్వసిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పలు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలు ఉన్న కారణంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డానే అధిష్టానం కొనసాగించింది. నడ్డాకు మరోమారు అవకాశం ఇచ్చినందున తెలంగాణలోనూ అసెంబ్లి ఎన్నికలు ఉండడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మార్చకూడదన్న అంచనాకు వచ్చారు. ఈ నెల 24న మహబూబ్‌నగర్‌లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నాటికి బండి సంజయ్ పదవీ కాలం పొడిగింపుపై అధిష్టానం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు.
పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీనియర్లు !
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీనియర్ నేత డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆశిస్తున్నారు. వీరంతా వలస నేతలే. ఎవరికి వారు అధిష్టానం వద్ద తమకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని విజ్ఞప్తులు చేసినట్లు తెలి సింది. అయితే పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా ప్రస్తుతం ఈటల రాజేందర్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే చేరికలు ముఖ్యమైన అంశం కావడంతో ఆ బాధ్యతలకే ఈటలను పరిమితం చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా డీకే అరుణ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తున్నందున ఇప్పుడు బండి సంజయ్ ను మార్చడం తెలివి తక్కువ నిర్ణయం అవుతుందన్న భావన హైకమాండ్‌లో ఉంది.
బండి సంజయ్ విషయంలో సంతృప్తిగా ప్రధాని !
2020 ఏడాదిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. ప్రజా సంగ్రామయాత్ర నిర్వహించి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. బండిసంజయ్ సారథ్యంలోనే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడంతోపాటు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ 44 కార్పోరేటర్ సీట్లను బీజేపీ గెలుచు కుంది. అధికార బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో ప్రత్యా మ్నాయం బీజేపీ అన్న స్థితికి పార్టీని తేవడంలో బండి సంజ య్ పాత్ర కీలకం. పలు మార్లు సభా వేదికలపైనే బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రధాని మోడీతోపాటు అమిత్ షా, జేపీ నడ్డా కొనియాడారు. ఇది ఆయనకు బాగా కలిసి వచ్చిందని అనుకోవచ్చు.
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS Budget Tensions : కేంద్రం నుంచి వచ్చేది అరకొరే - బడ్జెట్ కత్తి మీద సామే ! హరీష్ రావు లెక్కల మాయాజాలం ఎలా ఉంటుంది ?
రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!
YSRCP One Capital : విశాఖ ఒక్కటే రాజధానా ? వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యూహం మారిందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక