అన్వేషించండి

Telangana Municipal Elections: రెఫరెండంగా మున్సిపల్ ఎన్నికలు - పట్టణ ఓటర్లు ఎవరి వైపు ?

Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఫలితాలు రాజకీయాలను మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Telangana municipal elections considered a referendum:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వెంటనే రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాల్‌లతో వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌ గా అభివర్ణించగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పాలనపై రెఫరెండం గా స్వీకరిద్దామని సవాల్ విసిరారు. మరోవైపు, పట్టణ ఓటర్లపై గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీ.. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.  

కాంగ్రెస్ పార్టీ: అధికార బలమే ప్లస్.. వ్యతిరేకతే మైనస్ 

ప్రస్తుతం అధికారంలో ఉండటం కాంగ్రెస్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, పెంచిన పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు పట్టణ ప్రాంత పేదలను ఆకట్టుకుంటాయని పార్టీ భావిస్తోంది. మంత్రి పొంగులేటి రెఫరెండం సవాల్ విసిరారంటే, ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని వారు గట్టిగా నమ్ముతున్నారు. అయితే, రైతు భరోసా పంపిణీలో జాప్యం, పట్టణాల్లో అభివృద్ధి పనులపై వస్తున్న విమర్శలు  పట్టణ మధ్యతరగతి ఓటర్లలో కొంత వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే, అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా మారుతుంది.

బీఆర్ఎస్ పార్టీ: ఉనికి కోసమే పోరాటం 

కేటీఆర్ ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా పేర్కొనడం వెనుక వ్యూహం ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటములతో డీలా పడ్డ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే ఈ విజయం వారికి అనివార్యం. కేసీఆర్ హయాంలో జరిగిన పట్టణాభివృద్ధి, ఐటీ పురోగతి తమకు ప్లస్ అవుతాయని గులాబీ దళం ఆశిస్తోంది. అయితే, పార్టీ నుంచి కీలక నేతలు వలస వెళ్లడం, హైకమాండ్ లోపల కుటుంబ విబేధాలు బహిర్గతం కావడం  ఈ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్లు. ఈ ఎన్నికల్లో కూడా వెనుకబడితే, పార్టీ భవిష్యత్తు మరింత ఇరకాటంలో పడుతుంది.

బీజేపీ: పట్టణ ఓటు బ్యాంకే కొండంత అండ

తెలంగాణలో బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో సహజంగానే బలమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రధాన నగరాల్లో హిందూత్వ కార్డు , కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు. మున్సిపాలిటీల్లో తమదే మెజార్టీ అని బండి సంజయ్, కిషన్ రెడ్డి ధీమాగా ఉండటానికి కారణం ఇదే. అయితే, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం,  జనసేన వంటి మిత్రపక్షం ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోవడం బీజేపీకి మైనస్ కావచ్చు.

ఎవరికి ఉత్సాహం.. ఎవరికి నీరసం?

ఈ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదని తేలిపోతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పుంజుకుంటే, కేసీఆర్ మార్క్ రాజకీయం ఇంకా ఉనికిలో ఉందని అర్థమవుతుంది. బీజేపీ గెలిస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తామే ప్రత్యామ్నాయమని ఢిల్లీకి సంకేతం పంపినట్లవుతుంది. ఫలితాలు తారుమారైతే, ఓడిన పార్టీల నుంచి వలసలు మరింత పెరిగి, ఆయా పార్టీల్లో తీవ్ర నీరసం ఆవరించే ప్రమాదం ఉంది. మున్సిపల్ ఎన్నికలు కేవలం కౌన్సిలర్లను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. తెలంగాణలో రాబోయే రాజకీయ దిశను నిర్దేశించే అతిపెద్ద  పోలింగ్ రెఫరెండం గా మారబోతున్నాయి.   

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
YS Jagan Political Strategy: బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Embed widget