Target KTR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కారణం కేటీఆరేనా ? అంతా ఆయనే చేస్తున్నారా ?
Telangana : కేటీఆర్ తీరుకు వ్యతిరేకంగానే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే వాదన బలపడుతోంది. ఆయనపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
BRS MLAs changing parties against KTR style : భారత రాష్ట్ర సమితి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులతో ఇబ్బంది పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచి బలంగా ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారో తెలియడం లేదు. ఇప్పటికే పది మంది పార్టీ మారిపోయారు. మరో పదిహేను మంది కూడా ఊగిసలాటలో ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ వీడిపోతున్నారంటే.. కాంగ్రెస్ ప్రలోభాలు అనే కారణం బీఆర్ఎస్ వైపు నుంచి వస్తుంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రధానంగా కేటీఆర్ డామినేషన్ కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడాన్ని ఎక్కువ కారణాలు చూపిస్తున్నారు. ఓ రకంగా అందరూ కేటీఆర్ ను కారణంగా చూపించే అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి.
ఐదేళ్లు పార్టీ, ప్రభుత్వంలో తిరుగులేని నేతగా కేటీఆర్
కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కాదు.. అనధికారిక సీఎంగానూ వ్యవహరించారు. కేసీఆర్ అత్యంత ముఖ్యమైన వ్యవహారాలను మాత్రమే చూసుకునేవారు. రోజువారీ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగేవి అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన చేతిల్లోనే పవర్ అంతా ఉంది కాబట్టి నెతలెవరూ అసంతృప్తి బయటకు వ్యక్తం చేయలేదు. పార్టీ వదిలి వెళ్లిపోయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గడ్డం వివేక్ వంి నేతలు మాత్రం . కారణంగా కేటీఆర్ అహంకారాన్ని చూపించేవారు. అయితే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పార్టీని వీడిపోతున్నవారు కేటీఆర్ న ప్రధానంగా కారణంగా చూపించేందుకు వెనుకాడటం లేదు. కేటీఆర్ అహంకారం, పార్టీ నేతల్ని గౌరవించని తీరు వల్లనే బీఆర్ఎస్ కు ఈ పరిస్తితి వచ్చిందని అంటున్నారు.
కేటీఆర్ గౌరవం ఇవ్వలేదని ఎమ్మెల్యేల భావన
కేటీఆర్ సమవేశాలకు పిలిస్తే అత్యధిక మంది ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. స్పీకర్ తో సమావేశానిక ఎమ్మెల్యేలు అందరూ కలిసి వెళ్లాలనుకున్నారు . కానీ కేసీఆర్ మినహాయించి 12 మంది డుమ్మా కొట్టారు. పార్టీ మారిన దానం నాగేందర్ బీఆర్ఎస్ దుస్థితికి కేటీఆరే కారణని ఆరోపణలు కూడా చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేటీఆర్ సీనియర్లకి గౌరవం ఇవ్వలేదు అనే ఆరోపణ కూడా చేశారు. ఆయన మాట వినే పరిస్థితిలో ఎవరూ లేరని వ్యాఖ్యానించడం గమనార్హం. పార్టీ పూర్తిగా బ్రష్టు పట్టడానికి కేసీఆర్ కాదని.. పూర్తిస్థాయి బాద్యుడు కేటీఆర్ మాత్రమేనని దానం తేల్చేశారు. కానీ ఎక్కువ మంది అభిప్రాయం అదేనని బీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే లకు బీఆర్ఎస్ లో గౌరవం లేకుండా కేటీఆర్ అవమానించేవారు. కేటీఆర్ గుట్టు త్వరలో బయటపెడతా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కలవనియకుండా గంటలు గంటలు నిరీక్షణ కు గురిచేసేవారు. కేటీఆర్ ఓన్లీ తన నియోజకవర్గం సిరిసిల్లలో వేల కోట్లతో డెవలప్ చేశారు తప్ప.. ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అభివృద్ధి కి నిధులు ఇవ్వలేదన్నది ఎక్కువ మంది అభియోగం.
హరీష్ రావుకు ప్రాధాన్యం పెరుగుతోందా ?
అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వచ్చిన ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీష్ సమావేశం అయ్యారు. అక్కడ మాత్రం కేటీఆర్.. ప్రధానమైన కుర్చీలో కూర్చోలేదు. హరీష్ రావు కూర్చుని ఎమ్మెల్యేతో మాట్లాడారు. కేటీఆర్ తనపై ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించి.. కాస్త తగ్గే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. హరీష్ రావును ముందు పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ మార్పు ఎంత వరకూ ఫలితం ఇస్తోందో .. ఎంత మంది పార్టీ మారకుండా ఆగుతారో చూడాలని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.