అన్వేషించండి

AP Urban Local Body Election Results: పట్టణ ఓటరు నాడి స్పష్టం - స్థానిక ఎన్నికల ఫలితాలు అసెంబ్లీకి సూచిక కావా?

AP Municipal Results: స్థానిక ఎన్నికల ఫలితాలు పార్టీల స్థితిగతుల్ని అంచనా వేయడానికి ఉపయోగపడవు. స్థానిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే పార్టీ క్యాడర్ మానసిక స్థితిని మాత్రం ప్రభావితం చేస్తుంది.

Urban Local Body Polls Voter Psychology AP: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ముందే చాలా మంది ఓ అంచనాకు వచ్చారు.  కౌంటింగ్ కేంద్రాల బయట విజయోత్సవాలు, పార్టీ కార్యాలయాల్లో సంబరాలు, నిరాశలతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. పట్టణ ఓటరు మూడ్ ఏ దిశగా ఉందో ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఇవి కేవలం రాజకీయ పార్టీల, స్థానిక నాయకుల మానసిక స్థితి పై ప్రభావం చూపే అంశాలే తప్ప.. రాబోయే శాసనసభ అసెంబ్లీ ఎన్నికలకు ఇవే ముందస్తు ఫలితాల సూచికలు లేదా ప్రజామోదానికి తుది ల్యాండ్‌మార్క్ అనడం ఎంతమాత్రం సరికాదన్న అభిప్రాయం ఉంది. 

స్థానిక ఎన్నికల ఓటింగ్ ప్రయారిటీ వేరు

స్థానిక సంస్థల ఎన్నికల స్వభావం, అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల నమూనా కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మున్సిపల్ పోరులో రాజకీయ పార్టీల గుర్తుపై పోటీ జరిగినప్పటికీ, పార్టీల ప్రాధాన్యత  కంటే వ్యక్తిగత సంబంధాలు, అభ్యర్థి గుణగణాలు, లోకల్ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఓటరు తన వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, నిత్యం అందుబాటులో ఉండే కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ అభ్యర్థి ఎవరు అనే దానిపైనే ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంటారు. స్థానిక సమస్యలను పరిష్కరించగల వ్యక్తికి ఓటేస్తారు తప్ప, రాష్ట్రస్థాయి పార్టీ విధానాలు లేదా జాతీయ అంశాలు వార్డు స్థాయి బ్యాలెట్ బాక్సులను పెద్దగా ప్రభావితం చేయవు.

స్థానిక ఎన్నికల్లోఫలితాలు  బలానికి సాక్ష్యం కావు!

చరిత్రను తిరగేస్తే.. మున్సిపల్ ఎన్నికలలో గెలిచినంత మాత్రాన ఆయా పార్టీలు తదుపరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాయనే గ్యారెంటీ ఎప్పుడూ లేదు. స్థానిక ఎన్నికలలో అధికార పక్షానికి ఎల్లప్పుడూ కొంత అధికారిక లబ్ధి  , యంత్రాంగం సపోర్ట్, ఎన్నికల నిర్వహణ అనుకూలత ఉంటాయి. అయితే, శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి ఓటరు ప్రాధాన్యతలు ఒక్కసారిగా మారిపోతాయి. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, రాష్ట్రాభివృద్ధికి ఏ పార్టీ సరిపోతుంది, సంక్షేమం ఎవరితో సాధ్యం అనే అంశాల ఆధారంగా స్థానిక అభ్యర్థితో సంబంధం లేకుండా ఓటు బ్యాంక్ రీ-అలైన్ అవుతుంది.  ప్రస్తుతం పార్టీల కేడర్ మానసిక స్థితిపై మాత్రం బలమైన ప్రభావం చూపుతాయి. 

ఫలితాలకు అనేక కారణాలు

గెలిచిన పార్టీకి తమ క్షేత్రస్థాయి యంత్రాంగంలో సరికొత్త ఉత్సాహం నిండుతుంది, నాయకులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓడిపోయిన పార్టీల్లో కార్యకర్తల నిరాశతో పాటు, నాయకత్వ వైఫల్యాలపై అంతర్గత అసంతృప్తి మొదలవుతుంది. ఈ మానసిక విజయం తాత్కాలికంగా పార్టీల ప్రచారాలకు, రాబోయే స్థానిక పోరాటాలకు శక్తిని ఇస్తుంది తప్ప, ఓటరు ఆలోచనా విధానం శాశ్వతంగా ఆ పార్టీ వైపే  ఉందని భావిస్తే అది ఆయా పార్టీల రాజకీయ పొరపాటే అవుతుంది. సోషల్ మీడియా , పొలిటికల్ డిస్క్రిప్షన్‌లలో ఇదే ప్రజల తుది తీర్పు , "రాష్ట్ర రాజకీయాల్లో గాలి ఏటుందో తేలిపోయింది  అంటూ పార్టీల మద్దతుదారులు చేసుకునే ప్రచారాలు కేవలం డిజిటల్ నెరేటివ్స్ మాత్రమే. పట్టణ ఓటరు అత్యంత తెలివైనవాడని, కార్పొరేషన్ స్థాయికి ఎవరిని ఎన్నుకోవాలో, రాష్ట్ర పీఠం ఎవరికి అప్పగించాలో స్పష్టమైన విభజన   ప్రదర్శిస్తారని అనేక గత ఎన్నికల అనుభవాలు రుజువు చేశాయి.

రాజకీయ నేతలకు తెలుసు!

 ఇవాళ వెలువడుతున్న పట్టణ ఫలితాలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల ఎంపికకు, పార్టీల క్యాడర్ బూస్టింగ్‌కు మాత్రమే పరిమితం. ఈ విజయాలను చూసి అధికార పక్షం అతివిశ్వాసానికి పోయినా, లేదా ప్రతికూల ఫలితాలను చూసి ప్రతిపక్షం పూర్తిగా ధైర్యం కోల్పోయినా పొరపాటే. అసెంబ్లీ రణరంగం వచ్చేసరికి సమీకరణాలు, అజెండాలు, ఓటరు తీర్పు పూర్తిగా మారుతాయనేదే స్థానిక ఎన్నికల రాజకీయం నేర్పిన అసలైన పాఠం.
  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
UP Politics BJP Challenges: యూపిలో బిజెపికి గడ్డు కాలం - ఎస్పీ జోరుకు యోగి బ్రేకులు వేయగలరా?
యూపిలో బిజెపికి గడ్డు కాలం - ఎస్పీ జోరుకు యోగి బ్రేకులు వేయగలరా?
KTR Praises Chandrababu: చంద్రబాబుకు కేటీఆర్ కితాబు - తెలంగాణ పొలిటికల్ గేమ్‌లో నలిగిపోతున్న మిత్రుడు జగన్!
చంద్రబాబుకు కేటీఆర్ కితాబు - తెలంగాణ పొలిటికల్ గేమ్‌లో నలిగిపోతున్న మిత్రుడు జగన్!
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget