అన్వేషించండి

AP special assembly sessions: మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?

AP Assembly: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్ణయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అత్యంత కీలకమైన అజెండా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు.

AP Special Assembly hidden agenda :   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.  మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం, విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తారని అంటున్నారు. అయితే ఏపీలో ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే.  పార్లమెంట్‌లో వైసీపీ కూడా ఈ బిల్లుకు అనుకూలంగానే ఓటు వేసింది. మరి ఎవరికి వ్యతిరేకంగా చర్చిస్తారు?. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమే. చర్చించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. 

 రాజ్యాంగ సవరణ - రాష్ట్రాల ఆమోదం  

మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ సవరణకు సంబంధించింది కాబట్టి, ఆర్టికల్ 368 ప్రకారం రాష్ట్రాల ఆమోదం అవసరం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక వంటివి జరుగుతున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఆ తర్వాత జరిగే రాజకీయాలు వేరుగా ఉంటాయి. అందుకే ఆ తర్వాత మరోసారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగసవరణ బిల్లులను ఆమోదించవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో  ఈ బిల్లు అమలు కావాలంటే దేశంలోని కనీసం 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. కేంద్రం త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో, దక్షిణాది నుంచి తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపి, మహిళా సాధికారతపై తన చిత్తశుద్ధిని చాటుకోవాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అమరావతి మించిన ప్రాధాన్యత? 

ఇటీవలే అమరావతి రాజధానిపై తీర్మానం  కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.  ఇప్పుడు అంతకు మించిన సందర్భం ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది. కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ హామీలు ..ఇతర అంశాలపై కీలకమైన బిల్లులను  ప్రభుత్వం తెరపైకి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.  చర్చల కోణంలో చూస్తే.. మహిళా రిజర్వేషన్లతో పాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న  తల్లికి వందనం,  మహిళల భద్రత కోసం మరిన్ని కఠినమైన చట్టాలను ప్రత్యేక బిల్లుల రూపంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ , ఇతర పార్టీలు ఈ బిల్లుపై రాజకీయ విమర్శలు చేస్తున్న తరుణంలో, ఏపీలో మాత్రం ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కేంద్రంతో ఉన్న సాన్నిహిత్యాన్ని, తన పట్టును ప్రదర్శించనున్నారు.

 రాజకీయ కోణం - విపక్షానికి సవాల్ 

వైసీపీ కూడా రిజర్వేషన్లకు అనుకూలమని చెప్పినప్పటికీ, అసెంబ్లీ వేదికగా ఆ పార్టీపై పదునైన విమర్శలు చేసేందుకు ఈ సమావేశాలను వేదికగా మార్చుకోనున్నారు.   ఏపీలో జగన్ హయాంలో మహిళా భద్రత, వైసీపీ నేతల వేధింపులు వంటి వాటిపై తులనాత్మక చర్చ జరపడం ద్వారా వైసీపీకి రాజకీయంగా చెక్ పెట్టవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తన మార్కు  మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.  అదేమిటనేది అసెంబ్లీ సమావేశాల్లోనే క్లారిటీ వస్తుంది.  

 

టాప్ హెడ్ లైన్స్

Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Cockroach Janata Party: విపక్షంలో ఎజెండా సెట్టర్‌గా కాక్రోచ్ జనతా పార్టీ - అసలు పొలిటికల్ గేమ్ ఎవరిది?
విపక్షంలో ఎజెండా సెట్టర్‌గా కాక్రోచ్ జనతా పార్టీ - అసలు పొలిటికల్ గేమ్ ఎవరిది?
AP Local Elections TDP Janasena Seat Sharing: స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget