News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Ministers : వరుస వివాదాలు, ఆరోపణల్లో మంత్రులు ! సీఎం జగన్ మరోసారి ఎన్నికల కేబినెట్ మార్చుకోక తప్పదా ?

ఏపీ మంత్రులు వరుస వివాదాలు, ఆరోపణల్లో ఇరుక్కుంటున్నారు. జగన్ ఎన్నికల టీంను మార్చుకుంటారా ?

FOLLOW US: 
Share:

AP Ministers :  మూడు నెలల కిందట జరిగిన ఓ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్.. సహచర మంత్రులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షానికి కౌంటర్ ఇవ్వడంలో పూర్తి స్థాయిలో వెనుకబడ్డారని మండిపడ్డారు. అదే సమయంలో పని తీరు.. వివాదాలు ఉన్న మంత్రులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు, నలుగురు మంత్రుల్ని మార్చేస్తానని అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాతి రోజే ఎవరెవరు మంత్రులకు ఉద్వాసన చెప్పబోతున్నారో మీడియాలో కొన్ని వర్గాలు ప్రకటించాయి.కానీ మూడు నెలలు గడిచిన తర్వాత ఆ ప్రస్తావన రావడం లేదు. కానీ ఈ టీంతో ఎన్నికలకు వెళ్తారా అన్న సందేహాలు మాత్రం ఆ పార్టీలో అంతర్గతంగా వస్తున్నాయి. కొంత మంది మంత్రులు మరీ మౌనంగా ఉంటూండగా..మరికొంత మంది వివాదాల్లో కూరుకుపోతున్నారు. దీంతో ఎంతో కొంత మార్పులు చేయక తప్పదన్న అంచనా ఆ పార్టీలో వినిపించడం ప్రారంభమయింది. 

తీవ్ర వివాదాల్లో అంబటి రాంబాబు, గుమ్మనూరు జయరాం !

ఏడాది మొదట్లో కొత్త కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత మంత్రులు పలు వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. తాజాగా ఆయన ఓ తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. తన బిడ్డ చనిపోతే వచ్చిన పరిహారంలో సగం లంచం అడిగారని ఆమె ఆరోపించారు. దానికి తగ్గట్లుగానే ఆమెకు నష్టపరిహారం చెక్ అందలేదు. దాంతో అందరిలోనూ అంబటి రాంబాబు కావాలనే అలా చేశారన్న నమ్మకం బలపడింది. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపింది. ఇక మరో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా అంతే. ఆయన రైతుల భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ భూముల్ని మార్కెట్ విలువకు మళ్లీ రైతులకే ఇచ్చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ వివాదం మాత్రం సద్దుమణిగే అవకాశం లేదు. 

కాకాణి గోవర్ధన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావుపై నైతిక పరమైన ఒత్తిడి ! 

మరో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు విషయంలో కోర్టులో దొంగతనం జరిగింది. ఆ సాక్ష్యాలు దొంగతనం జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. చివరికి హైకోర్టు సీబీఐకి ఇచ్చింది. సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండటం  నైతిక కాదన్న వాదన వినిపిస్తోంది. విపక్ష పార్టీలు.. సీబీఐ దర్యాప్తును మంత్రి ప్రభావితం చేయరన్న గ్యారంటీ ఏమిటని అంటున్నారు. నైతిక బాధ్యతగా అయినా రాజీనామా చేయాలని అంటున్నారు. మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెవిన్యూ మంత్రిగా పని చేశారు. అప్పట్లో భూఅక్రమాలకు పాల్పడ్డారని..  సిట్ నివేదిక వెల్లడించింది . దీంతో ఆయన కూడా పదవిలో ఎలా కొనసాగుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ మంత్రులు ఆయా వివాదాస్పద అంశాలపై ఎదురుదాడి చేస్తూ.. పదవుల్లో కొనసాగిస్తున్నారు. కానీ ఎన్నికల్లో ఇదో వివాదం అయినా ఆశ్చర్యం లేదు. 

సాఫ్ట్ గా మరికొందరు మంత్రులు !

అయితే పనితీరు పరంగా చూస్తే కొంత మంది మంత్రులు సాఫ్ట్ గా ఉంటున్నరు. విపక్షంగా చూపించాల్సినంత దూకుడు చూపించడం లేదు.  ఏం జరిగినా మంత్రి జోగి రమేష్ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇతర మంత్రులు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఒకరిద్దరు మంత్రులు స్పందిస్తున్నప్పటికీ ఆ డోస్ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సరిపోవడం లేదు. నిజానికి ఏపీ మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వారి పేర్లేమిటో చాలా మందికి గుర్తు ఉండదు. అసలు మంత్రుల పేర్లేమిటో కూడా జనానికి గుర్తు లేదని విపక్ష పార్టీలు సెటైర్లు వేస్తూంటాయి. గత మంత్రివర్గంలో కొడాలి నాని, పేర్ని  సహా పలువురు చాలా యాక్టివ్ గా ఉండేవారు. వారిని తీసి పక్కన పెట్టడంతో ప్రాధాన్యత  తగ్గిపోయింది. 

అందుకే ఎన్నికల టీంను జగన్ రీషఫుల్ చేస్తారన్న వాదన వైఎస్ఆర్‌సీపీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా చేస్తారో లేదో కానీ... ప్రస్తుతం ఉన్న టీమ్ మాత్రం పర్ ఫెక్ట్ కాదని రాజకీయవర్గాల అంచనా. 

Published at : 23 Dec 2022 06:00 AM (IST) Tags: AP Politics AP Ministers AP Cabinet CM Jagan Controversies Ministers in Allegations

ఇవి కూడా చూడండి

Andhra Cyclone Loss : విపత్తులొచ్చినప్పుడల్లా ఏపీ సర్కార్ నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తోందా ? సీఎం జగన్ తీరుపై విమర్శలెందుకు ?

Andhra Cyclone Loss : విపత్తులొచ్చినప్పుడల్లా ఏపీ సర్కార్ నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తోందా ? సీఎం జగన్ తీరుపై విమర్శలెందుకు ?

కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు ఉచ్చు బిగిస్తున్నాయా ? ఉసి గొల్పుతున్నాయా ?

కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు ఉచ్చు బిగిస్తున్నాయా ?  ఉసి గొల్పుతున్నాయా ?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

revanth reddy take oath as telangana cm : రేవంత్ ప్రమాణస్వీకారానికి ఏపీ నుంచి రాని నేతలు - సోషల్ మీడియాలో మాత్రం శుభాకాంక్షలు !

revanth reddy take oath as telangana cm  : రేవంత్ ప్రమాణస్వీకారానికి ఏపీ నుంచి రాని నేతలు - సోషల్ మీడియాలో మాత్రం శుభాకాంక్షలు !

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vizag Pawan Kalyan :  ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?