అన్వేషించండి

AP Local Body Elections 2026: ఏపీ స్థానిక పోరు - జగన్ ఆశలపై కూటమి నీళ్లు - అంతర్గత పోరును తలకిందులు చేస్తున్న బాబు-పవన్ వ్యూహం?

YS Jagan Strategy: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలు వస్తాయన్న వైఎస్‌ఆర్‌సీపీ అంచనాలను పటాపంచలు చేస్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ సమన్వయం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Chandrababu Pawan Kalyan local election coordination:  ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు పెద్ద సవాలుగా మారతాయని ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ అంచనా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల పరిధిలో సీట్ల సర్దుబాటు ఒక ఎత్తయితే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే వేలాది వార్డులు, పంచాయతీలు, జడ్పీటీసీ స్థానాల్లో స్థానిక నాయకుల ఆశలను సమన్వయం చేయడం అసాధ్యమని జగన్మోహన్ రెడ్డి భావించారు. ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ మూడు పార్టీల నుంచి ఆశావహులు పోటీపడటం వల్ల కూటమిలో అంతర్గత కుమ్ములాటలు వచ్చి, తమకు రాజకీయంగా పెద్దపీట దక్కుతుందని వైఎస్‌ఆర్‌సీపీ ఆశించింది. అయితే, ఈ ప్రతిపక్ష వ్యూహాన్ని కూటమి అగ్రనాయకత్వం ముందే పసిగట్టి చురుగ్గా అడుగులు వేస్తోంది.

క్షేత్ర స్థాయిలో సమన్వయానికి ప్రయత్నాలు   

గ్రామ స్థాయి నుంచి అసంతృప్తులు రేగకుండా కూటమి పెద్దలు  పవర్ షేరింగ్,  కో-ఆర్డినేషన్ సూత్రాన్ని అమల్లోకి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన 80:15:5 ఫార్ములాను లేదా స్థానిక బలాబలాల ఆధారంగా సీట్ల పెంపకాన్ని స్పష్టమైన రూట్ మ్యాప్‌తో పరిష్కరించాలని నిర్ణయించారు. పంచాయతీ లేదా వార్డు స్థాయిలో ఏ పార్టీకి బలం ఉంటే అక్కడ ఆ పార్టీ అభ్యర్థికి మిగిలిన రెండు పార్టీలు మద్దతు తెలిపేలా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్ఠానం నిరంతరం సమాచార మార్పిడి చేసుకుంటూ, క్షేత్రస్థాయి సమన్వయం దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

లోకల్ కేడర్ తిరుగుబాట్లు ఉంటాయనుకున్న వైసీపీ 

వైఎస్‌ఆర్‌సీపీ వ్యూహం వెనుక మరో బలమైన కారణం ఉంది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీలో టికెట్లు దక్కని ఆశావహులు తిరుగుబాటు చేయడం సహజం. ఈసారి కూటమిలో మూడు పార్టీలు ఉన్నందున ఆ తిరుగుబాటు ముమ్మరమై, ఓట్లు చీలిపోయి తమకు కలిసివస్తుందని జగన్ వర్గం భావించింది. కానీ, కూటమి నాయకత్వం తిరుగుబాటు అభ్యర్థులకు నామినేటెడ్ పదవులు, సొసైటీ బోర్డులు, స్థానిక కమిటీలలో అవకాశాలు కల్పిస్తామని ముందస్తు భరోసా ఇస్తోంది. దీంతో టికెట్ దక్కని నాయకులు కూడా పార్టీ గీత దాటకుండా సర్దుకుపోయేలా కార్యాచరణ సిద్ధమైంది. వైఎస్‌ఆర్‌సీపీ ఇప్పటివరకు వైఫల్యాలను ఎండగడుతూ కూటమిపై వ్యతిరేకత పెరిగిందని ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీకి గట్టి అభ్యర్థులను నిలబెట్టడమే పెద్ద సవాలుగా మారింది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత గ్రామ స్థాయిలో క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. ఈ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి కూటమిలో చీలికలు వస్తాయని జగన్ ఆశించినా, కూటమి నాయకత్వం మాత్రం ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతా రాగం వినిపిస్తోంది. స్థానిక పోరులో కూడా ఏకీకృత ప్రచారం నిర్వహించేందుకు రోడ్‌మ్యాప్‌ తయారు చేసేశారు.

సమైక్యంగా తిరుగుబాట్లు లేకుండా కూటమి పోటీ  చేసే చాన్స్ 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కూలిపోతుందన్న ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఆశలపై కూటమి పెద్దలు పక్కా వ్యూహంతో నీళ్లు చల్లారు. క్షేత్రస్థాయి సమీకరణాలను ముందే బేరీజు వేసుకుంటూ, ఆశావహులను బుజ్జగిస్తూ, పవర్ షేరింగ్ నెరవేరుస్తూ ముందుకు సాగుతుండటంతో వైఎస్‌ఆర్‌సీపీ ఆశించిన కూటమి కుమ్ములాటల  అడ్వాంటేజ్ దక్కేలా కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తమ పొత్తు బంధం కేవలం ఎన్నికలకే పరిమితం కాదని నిరూపించడానికి కూటమి పక్షాలు సిద్ధమవుతున్నాయి. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Krishna Water War: కృష్ణా జలాల వేడి - కుప్పం దాకా నీళ్లు.. మహబూబ్‌నగర్‌కు మొండిచెయ్యి - రికార్డులు చెబుతున్న నిజాలేంటి?
కృష్ణా జలాల వేడి - కుప్పం దాకా నీళ్లు.. మహబూబ్‌నగర్‌కు మొండిచెయ్యి - రికార్డులు చెబుతున్న నిజాలేంటి?
Church Aid Row: చర్చిలకు రూ.30 వేల సాయం.. రేవంత్ సర్కార్‌కు లాభమా? బీజేపీకి అస్త్రమా?
చర్చిలకు రూ.30 వేల సాయం.. రేవంత్ సర్కార్‌కు లాభమా? బీజేపీకి అస్త్రమా?
Delimitation Bill: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stalin vs Rahul Gandhi: స్టాలిన్ కోసం రాహుల్ గాంధీ యూటర్న్? ఫలితం ఉంటుందా? తగ్గేదేలే అని డీఎంకే అధినేత క్లారిటీ
స్టాలిన్ కోసం రాహుల్ గాంధీ యూటర్న్? ఫలితం ఉంటుందా? తగ్గేదేలే అని డీఎంకే అధినేత క్లారిటీ
Deeksha Divas: తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Embed widget