BJP Vishnu On AP Govt : డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ రెండు వర్గాలకేనా ? మిగతా వాళ్లేం పాపం చేశారంటున్న బీజేపీ !
ముస్లింలు, క్రిస్టియన్లకే డ్రోన్ పైలెట్ శిక్షణ ఇస్తున్నారని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు.
BJP Vishnu On AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ముస్లిం, క్రిస్టియన్ల కోసం పని చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తూ.. డర్టీ పాలిటిక్స్ చేస్తోందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసిందిని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ తీసుకునేందుకు యువతను ఆహ్వానిస్తూ ఆ ప్రకటన విడుదల చేశారని.. అందులో ప్రత్యేకంగా ముస్లింలు, క్రిస్టియన్లకు మాత్రమే అని పేర్కొన్నారని చెబుతున్నారు. ఈ అంశాన్ని విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఆ రెండు కమ్యూనిటీస్‌కే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
YS Jagan Mohan Reddy govt launches free Drone Pilot training, placement program only for Christians and Muslims, BJP leader shares ad https://t.co/DAULWbfSL2 via @OpIndia_com@JPNadda / @blsanthosh
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 23, 2022
ఐపీఎస్ మణికంఠకు చట్టాలు తెలియదా ? - రూల్స్ పాటించని అధికారులను వదిలే ప్రసక్తే లేదన్న అచ్చెన్న !
భారతీయ జనతా పార్టీ విద్యను అందించడానికి కానీ యువతకు ఉపాధి కల్పించాడనికి కూడా వ్యతిరేకం కాదని కానీ కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసి కొన్ని వర్గాలను ప్రోత్సహించడానికి మాత్రం వ్యతిరేకమని విష్ణువర్దన్ రెడ్డి అంటున్నారు.
We are not against education, neither against training for jobs but when the state gvt is saying that this course is for minorities then why not to consider the other minorities of Andhra Pradesh for the training purposes?
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 22, 2022
Every student deserves equal chance in all the fields.
పవన్ పిలుపు కోసం ఫృధ్వీ వెయిటింగ్ - జగన్ పిలిచినా వెళ్లనంటున్న కమెడియన్ !
విష్ణువర్దన్ రెడ్డి చేసిన ట్వీట్.. . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ శాఖ జారీ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అందరికీ సమాన అవకాశాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని.. నెటిజన్లుఅంటున్నారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ ప్రకటన ప్రభుత్వానిదేనా లేకపోతే.. ఇతర స్వచ్చంద సంస్థలు ఏమైనా ఇచ్చాయా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.