అన్వేషించండి
Smart Shopping Tips : Amazon Prime Day, Flipkart Sales.. డిస్కౌంట్ పేరుతో మోసపోకుండా ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Amazon Prime Day and Flipkart Sale : అమెజాన్ ప్రైమ్ డే, ఫ్లిప్ కార్ట్ GOAT సేల్స్ ప్రారంభమయ్యాయి. డౌస్కౌంట్ల స్కామ్ బారిన పడకండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఈ టిప్స్ ఫాలో అవ్వండి (Image Source : Freepik)
1/6

నకిలీ వెబ్‌సైట్‌లు లేదా మోసపూరిత ఆఫర్‌లతో చాలామంది మోసపోతూ ఉంటారు. Amazon Prime Day, Flipkart Sale వంటి ప్రసిద్ధ ఈవెంట్‌ల సందర్భంగా వాటిపేరుతో స్కామర్‌లు నకిలీ వెబ్‌సైట్‌లను తయారు చేస్తున్నారు. ఇవి అసలైన సైట్‌ల వలె కనిపిస్తాయి. కానీ ఈ ప్లాట్‌ఫారమ్‌లు అసలైనవి కాదు. వినియోగదారుల నుంచి బ్యాంక్ వివరాలు, OTPలను సేకరించి మోసం స్కామర్లు మోసం చేస్తారు. కాబట్టి ఏదైనా వెబ్సైట్నుంచి ఆర్డర్ చేసే ముందు దాని URLని జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. www.amazon.in లేదా www.flipkart.com వంటి అధికారిక సైట్‌ల నుంచి మాత్రమే షాపింగ్ చేయాలి.
2/6

అలాగే కొనుగోలు చేసే ముందు ఉత్పత్తి ధరలను పోల్చడం కూడా ముఖ్యమే. రెండు సైట్లు వేర్వేరు బ్రాండ్లు, మోడళ్లపై వేర్వేరు డిస్కౌంట్లను అందిస్తాయి. చాలాసార్లు ఒకే ఉత్పత్తిపై Amazonలో తక్కువ ధర లభిస్తుంది. కొన్నిసార్లు Flipkartలో మంచి బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది. వీటితో పాటు మీ కార్డుపై లభించే తగ్గింపులను కూడా చూసుకోండి. ఎందుకంటే HDFC, SBI, ICICI కార్డులపై వేర్వేరు తగ్గింపులు ఉంటాయి.
Published at : 15 Jul 2025 03:07 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















