అన్వేషించండి
Heart Failure Symptoms : గుండె వైఫల్యం ముందస్తు సంకేతాలివే.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Early Heart Disease Signs : గుండె శరీరానికి ఇంజిన్ లాంటిది. ఇది సరిగ్గా పనిచేస్తే ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. కానీ గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయకుంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..
గుండె సరిగ్గా పనిచేయట్లేదని చెప్పే సంకేతాలు ఇవే
1/10

రెగ్యులర్‌గా తేలికపాటి తలనొప్పి, దృష్టి మందగించడం లేదా స్పృహ కోల్పోయినట్లు అనిపిస్తే.. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందట్లేదని అర్థం. ఇది గుండెకు రక్తం సరఫరా కాకపోవడానికి సంకేతం కావచ్చు. బలహీనతగా భావించి దీన్ని విస్మరించవద్దు. ముఖ్యంగా సింపుల్ పనులు చేసినా అలసిపోతే అస్సలు వదలకూడదు.
2/10

రాత్రి సమయంలో పదేపదే నిద్ర లేవడం.. దగ్గువల్ల నిద్ర పట్టకపోవడం, పడుకోగానే ఊపిరి ఆడకపోవడం వంటివి గుండెకు సంబంధించిన సమస్యలకు సంకేతం కావచ్చు. పడుకున్నప్పుడు ఇవి మరింత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో శరీరంలో రక్తప్రసరణ పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
3/10

గుండెలో నొప్పి, ఒత్తిడి లేదా బరువుగా అనిపించడం వంటి అనుభూతి.. గుండె సమస్యలను సూచిస్తుంది. ఇది గుండెకు తక్కువ రక్తం సరఫరా లేదా గుండెపోటు ప్రారంభ లక్షణం కావచ్చు. తేలికపాటి లేదా అప్పుడప్పుడు వచ్చే నొప్పిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
4/10

మెట్లు ఎక్కడం నుంచి కొంచెం దూరం నడిచినా లేదా రెగ్యులర్‌గా చేసే పనులు కష్టంగా అనిపిస్తే.. గుండె శరీర అవసరాలకు తగినట్లుగా రక్తాన్ని పంప్ చేయలేకపోతోందని సంకేతం. గుండె పనితీరు బలహీనంగా ఉండటానికి ప్రారంభ లక్షణం.
5/10

కొన్ని రోజుల్లోనే 2 నుంచి 3 కిలోల బరువు పెరగడం సాధారణ ఊబకాయం కాదు. శరీరంలో ద్రవం పేరుకుపోయిందనడానికి సంకేతం. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, మూత్రపిండాలు ఆ ద్రవాన్ని బయటకు పంపలేనప్పుడు ఇలా జరుగుతుంది.
6/10

నిరంతరం దగ్గు వస్తూ.. తెల్లగా లేదా గులాబీ రంగులో నురగలాంటి కఫం వస్తే.. ఊపిరితిత్తులలో ద్రవం చేరినట్లు సూచన కావచ్చు. దీనిని ఊపిరితిత్తుల సమస్యగా భావిస్తారు. కాని ఇది గుండెకు సంబంధించినది కూడా కావచ్చు.
7/10

గుండె వేగంగా కొట్టుకోవడం, ఆగి ఆగి కొట్టుకోవడం లేదా దడదడలాడటం.. గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడుతోందని ఇది సూచిస్తుంది. దీనిని అరిథ్మియా అంటారు. ఇది గుండె జబ్బులలో భాగం కావచ్చు.
8/10

నిరంతరం అలసిపోవడం, శక్తి లేకపోవడం లేదా బలహీనంగా అనిపించడం, విశ్రాంతి తీసుకున్నా కూడా ఇబ్బందిగానే ఉండడం గుండె వైఫల్యానికి సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయనప్పుడు కండరాలు, అవయవాలకు ఆక్సిజన్, శక్తి అందదు.
9/10

కాళ్లలో లేదా చీలమండలలో వాపు పెరిఫెరల్ ఎడీమా ఏర్పడుతుంది. రక్తం ప్రవాహం నెమ్మదిగా మారినప్పుడు, ద్రవం చుట్టుపక్కల కణజాలంలో పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుంది. ఈ వాపు ఎక్కువగా కాళ్లు, చీలమండలలో కనిపిస్తుంది.
10/10

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, రాత్రిపూట ఒక్కసారిగా లేచి గాలి కోసం ఆరాటపడటం లేదా దిండ్లు పెంచుకుని పడుకోవలసి రావడం గుండె వైఫల్యానికి ఒక క్లాసిక్ లక్షణం. దీనిని ఆర్థోప్నియా అంటారు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయనప్పుడు ఇది జరుగుతుంది. దీని వలన ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోతుంది.
Published at : 30 Oct 2025 04:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
లైఫ్‌స్టైల్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















