అన్వేషించండి
Brahmamudi Serial Today May 3rd: రాజ్ స్టోరీని తన కథగా చెప్పిన కళ్యాణ్, ఆలోచనలో రాజ్ ఆతృతతో కావ్య - బ్రహ్మముడి’ సీరియల్ మే 03 ఎపిసోడ్ హైలెట్స్
Brahmamudi Serial Today Episode:గతం మర్చిపోయిన యామినితో పెళ్లికి సిద్ధమవుతుంది యామిని... అది జరగదంటూ షాకిస్తుంది కావ్య. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. బ్రహ్మముడి మే 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
‘బ్రహ్మముడి’ సీరియల్ మే 03 ఎపిసోడ్ హైలెట్స్ - Brahmamudi Serial Today May 3rd Episode
1/9

రాజ్‌ని రిసార్ట్‌కి తీసుకెళ్లేందుకుప్లాన్ చేస్తారు దుగ్గిరాల ఫ్యామిలీలో కావ్య పార్టీ సభ్యులు. ఇంట్లోంచి బయలుదేరుతుంది కావ్య..ఎప్పటిలా రుద్రాణి సెటైర్స్ వేస్తుంది..నాలుగు తిట్లు తింటుంది
2/9

కావ్య బయటకు వచ్చిన తర్వాత వెనుకాలే బయటకు వస్తారు రుద్రాణి , రాహుల్. ఎక్కడికి అని అడిగితే ఫ్రెండ్స్ తో పార్టీకి అంటుంది. నీకు పార్టీ కల్చర్ పడదనుకుంటా అంటాడు రాహుల్. నీకు నేను చెప్పానా అని ఫైర్ అవుతుంది కావ్య.
3/9

చీరలు కట్టుకున్న వాళ్లు ఛీర్స్ కొట్టకూడదని లేదుకదా అంటుంది కావ్య. నిజం చెప్పు అని రుద్రాణి అడిగితే..నా ఆనందం కోసం నేను ఈ మధ్య రియలైజ్ అయ్యాను..అందుకే నా ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నా..వెళ్లొస్తా అనేసి వెళ్లిపోతుంది కావ్య. ఏదో తేడా కొడుతోంది నువ్వు దాన్ని అనుసరించు అని రాహుల్ కి ఆర్డర్ వేస్తుంది రుద్రాణి.
4/9

నేను మీ ఇంటికి వస్తానంటే వద్దన్నారేంటి అంటాడు రాజ్..మీకెందుకు శ్రమ అంటుంది కావ్య. ఇందులో ఎలాంటి శ్రమ లేదంటాడు రాజ్. ఓ అబ్బాయితో కలసి రిసార్ట్ కి వెళుతున్నా అంటే ఇంట్లోవాళ్లు ఏమనుకుంటారో కదా అందుకే వద్దన్నాను అంటుంది కావ్య.
5/9

మీరు ఇంట్లో అబద్ధంచెప్పి వచ్చారా అని రాజ్ అడిగితే..మీరు యామినికి నిజం చెప్పి వచ్చారా అంటుంది కావ్య. కొంతమంది కోసం కొన్నిసార్లు అబద్దం చెప్పొచ్చు అంటుంది కావ్య..రాజ్ మురిసిపోతాడు
6/9

కావ్య ఎక్కడికి వెళ్లిందో అని రుద్రాణి, రాహుల్ ఆలోచనలో పడతారు..ఇంతలో స్వప్న వచ్చి పాపని ఇచ్చి వెళ్లిపోతుంది.నేను అందర్నీ ఏడిపిస్తే నువ్వు నన్ను ఏడిపిస్తావా అని చిన్నారిపై విసుక్కుంటుంది రుద్రాణి
7/9

కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునేందుకు ఓ దారి దొరికింది అంటాడు రాహుల్. ఇందాక పాపని తీసుకుంటున్నప్పుడు స్వప్న మొబైల్ కొట్టేశానంటూ ఓ నంబర్ కి కాల్ చేస్తాడు. ఓ వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి నా భార్యతో నీకు సంబంధం ఏంటని అట్నుంచి కాల్ వినిపిస్తుంది
8/9

రాజ్ గతం మర్చిపోయాడని ఫ్రెండ్స్ కి చెబుతారు కళ్యాణ్, అప్పు. కాలేజ్ డేస్ లో ప్రిన్సిపాల్ కన్నా స్ట్రిక్ట్ గా ఉండేవాడు వాడిపై ప్రతీకారం తీర్చుకుంటా అంటారు ఫ్రెండ్స్ . వీళ్లను నమ్మి బావగారిని వాళ్ల చేతిలో పెడితే ఏమవుతుందో అంటుంది అప్పు.. అన్నయ్య అంటే వాళ్లకి ప్రాణం ఏమీ జరగదంటాడు కళ్యాణ్
9/9

బ్రహ్మముడి మే 05 ఎపిసోడ్ లో... ఇంతలో రాజ్ కావ్య అక్కడకు వస్తారు. రాజ్ కి అప్పుని పరిచయం చేస్తాడు కళ్యాణ్. ఆ తర్వాత రాజ్ గతంలో హెల్ప్ చేసిన ఫ్రెండ్ న పరిచయం చేసి..రాజ్ తనకి చేసిన హెల్ప్ కళ్యాణ్ చేసినట్టు కథ చెబుతాడు. ఇదంతా నా లైఫ్ లో జరిగినట్టుంది అనిపిస్తోంది అంటాడు రాజ్
Published at : 03 May 2025 08:57 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
మొబైల్స్
ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















