అన్వేషించండి
Brahmamudi Serial Today November 26th Highlights : రుద్రాణి కొత్త స్కెచ్ కావ్యకు ప్లస్ ..రాజ్ కి ఇచ్చిపడేసిన అపర్ణ - బ్రహ్మముడి నవంబరు 26 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి CEO సీటు కోసం జరిగిన పోటీలో డిజైన్లు దొంగిలించి మరీ గెలిచి కావ్యను ఓడించాడు రాజ్... ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 24th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

అపర్ణని ఎందుకు తీసుకురాలేదని సుభాష్ అడిగితే..వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చింది మమ్మీ...అందుకే అదెప్పటికీ జరగదు అనేస్తాడు కావ్య. భార్యకి కాల్ చేసిన సుభాష్..ఇప్పుడేం చేద్దాం అని అడుగుతాడు. రెండు రోజుల్లో వాడే దిగొస్తాడని క్లారిటీ ఇస్తుంది అపర్ణ..
2/9

అపర్ణ మాటలు విన్న కావ్య..అత్తయ్య మీరు తప్పు చేస్తున్నారు వృధా ప్రయత్నం ఎందుకు వెళ్లిపోండి అంటుంది. నా కొడుకు సంగతి నాకు తెలుసు కానీ...సలహాలు ఇవ్వడం మానేసి వంట చేయి..నీ చేతి వంట తిని చాలా రోజులైందని ప్రేమగా కోప్పడుతుంది..
3/9

ఎవరో ఒకర్ని నీవైపు తిప్పుకుంటే కానీ నువ్వు అనుకున్నది సాధ్యం కాదంటుంది రుద్రాణి. కావ్య గురించి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు... కళ్యాణ్ గురించి అయితే టైమ్ కావాలంటున్నారని.. ఇంట్లో ఎవరో ఒకర్ని నీవైపు తిప్పుకో అని నిప్పు రాజేస్తుంది.
4/9

కవి-అప్పు ఇద్దరూ రోడ్డు పక్కన పానీపూరీ తింటుంటే అదే దారిలో వెళుతున్న అనామిక...కారు దిగి మరీ వచ్చి అవమానిస్తుంది. అప్పు రివర్సవుతుంది కానీ కళ్యాణ్ ఆపేస్తాడు. మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలంటాడు.
5/9

స్వప్నకి జ్యూస్ తీసుకొచ్చిన పనిమనిషిపై ఫైర్ అవుతుంది రుద్రాణి. నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదా అంటుంది. స్వప్నమ్మ అయితే కడుపుతో ఉన్నారు..మీకేం దిట్టంగా ఉన్నారుగా అంటుంది. బయటకు అలా ఉంటారు కానీ లోపలన్నీ రోగాలే అని సెటైర్ వేస్తుంది స్వప్న.
6/9

పెద్ద మెనూ చెప్పిన రుద్రాణితో.. కావ్యమ్మ ఉన్నప్పుడు సాయం చేసేవారు ఇప్పుడు మీరు సాయం చేస్తారా అని అడుగుతుంది. నేను చెప్పింది చేయకపోతే పన్లోంచి పీకేస్తా అంటుంది. ఆ మాట ఎప్పుడంటారా అని చూస్తున్నా.. నా వల్ల కాదు ఇంతమందికి వండి పెట్టడం అనేసి పనమ్మాయి మానేస్తుంది
7/9

రాజ్ రూమ్ కి వచ్చిన సుభాష్..అపర్ణ లేని ఆ రూమ్ లో నిద్రపోలేను ఇక్కడ నువ్వు తోడుగా ఉంటావని వచ్చానంటాడు సుభాష్. అందరూ నీలా భార్య లేకపోయినా ప్రశాంతంగా ఉండలేరుగా అని సెటైర్ వేస్తాడు. ఇన్ డైరెక్ట్ గా ఇన్సల్ట్ చేయొద్దు..పడుకోండి అంటాడు..
8/9

ఏదో ఆలోచనలో ఉన్న ధాన్యలక్ష్మితో..స్వీట్స్ తీసుకురా తినాలని ఉందంటాడు ప్రకాశ్. మళ్లీ కళ్యాణ్ గురించి మొదలుపెట్టి రచ్చ చేస్తుంది. కళ్యాణ్ విషయం తేలేవరకూ బయటే ఉండండి అంటూ దిండు, దుప్పటి ఇచ్చి ప్రకాశాన్ని బయటకు పంపించేస్తుంది
9/9

బ్రహ్మముడి నవంబరు 27 ఎపిసోడ్ లో...నానమ్మ ఇందిరాదేవి వంట చేస్తూ చేయి కాల్చుకుంది మా అమ్మను పంపు అని కావ్యకు కాల్ చేస్తాడు రాజ్. ఏదో నీ భార్యపై హక్కున్నట్టు మాట్లాడుతున్నావ్ వచ్చి నీ భార్యను తీసుకెళ్లు అని ఫోన్ లాక్కునిమరీ చెబుతుంది....
Published at : 26 Nov 2024 09:07 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion