అన్వేషించండి
Brahmamudi January 31st Episode Highlights: రాజ్ కావ్య అమెరికా ప్రయాణం.. రెచ్చిపోతున్న రుద్రాణి - బ్రహ్మముడి జనవరి 31 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 31th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi January 31 Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/9

కావ్య వేసిన డిజైన్ విషయంలో రాజ్ తో సరదాగా వాదనకు దిగుతుంది. డిజైనర్ గొప్పా-సీఈఓ గొప్పా అని వాదించుకుంటారు. ఆ తర్వాత కావ్య వేసిన నక్లెస్ డిజైన్ ని ఆక్షన్ కి పంపిస్తారు
2/9

ఆక్షన్లో ఆ నక్లెస్ డిజైన్ కోటీ 80 లక్షలు పలుకుతుంది. దానికి నువ్వు ఉహించింది ఎంత అని రాజ్ అంటే 25 లక్షలు అంటుంది కావ్య. నువ్వు ఎంత కష్టపడి క్రియేటివ్ గా డిజైన్ వేశావన్నది పాయింటా..ఇంత రేటుకి అమ్మడం పాయింటా అని క్వశ్చన్ చేస్తాడు. నేనే గ్రేట్ అని మళ్లీ అంటాడు. మీరే గ్రేట్ అని ఒప్పుకుంటుంది కావ్య
3/9

ఇంటి రెంట్ వేయలేదేంటని స్వప్న వేరే వ్యక్తికి కాల్ చేస్తుంది.. అకౌంట్లో 2 లక్షలు పడతాయి. ఇదంతా విన్న రాహుల్, రుద్రాణి మనం చిల్లర కోసం కష్టాలుపడుతుంటే అది మాత్రం తాతయ్య ఇచ్చిన ఆస్తిని ఎంజాయ్ చేస్తోంది అనుకుంటారు.
4/9

స్నప్నకి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది రుద్రాణి.. మాటల్లో పెట్టి తన అకౌంట్ నుంచి రెండు లక్షలు ట్రాన్ఫర్ చేసుకుంటాడు రాహుల్. ఏమైందని స్వప్న కంగారుపడుతుంటే ఏవో లింక్స్ క్లిక్ చేశావ్ అందుకే డబ్బులు పోయాయ్అని తప్పుదారి పట్టిస్తాడు.
5/9

గుడ్ న్యూస్ తో వచ్చానంటాడు సూరజ్..ఆ మాట విని చాలా రోజులైందంటాడు రాజ్. మీ డిజైన్లు అమెరికన్ క్లైంట్స్ కి నచ్చాయ్ మీరు అక్కడకు వెళ్లి డెమో ఇస్తే కాంట్రాక్ట్ ఓకే చెసుకోవచ్చంటాడు.
6/9

కంగ్రాట్స్ చెప్పిన కావ్యతో మీరు కూడా వెళ్లాలండీ అంటాడు సూరజ్. త్వరగా వీసా రెడీ చేసుకోండి అని చెబితే కావ్య సంతోషంగా గెంతులేస్తుంది
7/9

స్వప్న అకౌంట్లోంచి కొట్టేసిన డబ్బులు ఎలా ఖర్చుచేయాలా అని ప్లాన్స్ వేసుకుంటారు రాహుల్, రుద్రాణి. ఇదంతా విన్న స్వప్న మీ పని చెప్తాను ఆగండి అనుకుంటుంది.
8/9

నాకో హెల్ప్ కావాలి రాహుల్ అని స్వప్న అంటే..డబ్బు కావాలా అంటాడు. అవును 50 వేలు కావాలంటుంది. లేవనేస్తారు రాహుల్, రుద్రాణి. ఆ డబ్బు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అనుకుంటుంది స్వప్న. రాహుల్ కి ఓ లింక్ పంపిస్తుంది..అది క్లిక్ చేయగానే స్వప్న అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి..
9/9

బ్రహ్మముడి ఫిబ్రవరి 01 ఎపిసోడ్ లో...నందని కాల్చి పారిపోయిన బైక్ వ్యక్తి నంబర్ ప్లేట్ ట్రేస్ చేశాం కానీ అది ఫేక్ అని తెలిసింది. ఇప్పుడు కేవలం ట్రాఫిక్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకోవాలంటాడు పోలీస్. ఏదో ఒకటి చేయండి అంటాడు రాజ్. మరోవైపు ఆస్తులు తాకట్టు పెట్టి రాజ్ కావ్య అమెరికా వెళ్లి సెటిల్ అవుదాం అనుకుంటున్నారని రుద్రాణి ఇంట్లో గొడవ స్టార్ట్ చేస్తుంది.
Published at : 31 Jan 2025 08:13 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
తెలంగాణ
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion