నివేదా థామస్, రెజీనా కసాండ్రా కీరోల్ ప్లే చేస్తున్న శాకిని-డాకిని సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ సినిమాకు రీమేక్.
శాకిని-డాకిని సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
కొరియన్ సినిమాలో ఇద్దరు యువకులు ప్రధాన పాత్రలు పోషించారు. అదే సినిమాను తెలుగులోకి వచ్చేసరికి ఇద్దరు అమ్మాయిలతో ప్లాన్ చేశాడు దర్శకుడు.
సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇద్దరు అమ్మాయిలు ట్రైనీ పోలీస్ ఆఫీసర్లు. అనుకోని పరిస్థితుల్లో అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే రౌడీ మూకల బారిన పడతారు. మానవ అక్రమ రవాణా నుంచి ఆ ఇద్దరు అమ్మాయిలు తమను తాము కాపాడుకుంటూనే.. మిగతా వారిని ఎలా రక్షించారు అనేదే సినిమా కథ.
శాకిని-డాకిని సినిమాలో ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్లను దర్శకుడు వైవిధ్యభరితంగా రూపొందించినట్లు తెలుస్తోంది.
సస్పెన్స్ థిల్లర్ గా కొనసాగే ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి కలిసి నిర్మిస్తున్నారు.
తొలుత ఈ సినిమా విడుదలపై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు.
చివరకు ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థలు సిద్ధం కావడం విశేషం.
శాకిని-డాకిని సినిమాతో ఆడియెన్స్ ను అలరించేందుకు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం నివేద థామస్ తమిళంతో పాటు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. రెజీనా మాత్రం శాకిని-డాకిని మీదే ఆశలు పెట్టుకుంది.
క్యూట్ నెస్ డోస్ పెంచిన అనికా సురేంద్రన్
Intinti Gruhalakshmi Prashanthi: సీతాకోకచిలుకలా 'గృహలక్ష్మి' అందమైన విలన్ లాస్య
Trisha - PS2 Trailer Launch : క్లాసిక్ బ్యూటీ త్రిష - వయసుతో పాటు అందాన్ని పెంచుతోందా?
Fatima Sana Shaikh : ఫుల్ పటాస్లా ఫాతిమా సనా షైఖ్, అమ్మాయి అదుర్స్ కదూ!
Adah Sharma Photos: మల్లెపూలు, కొంటెచూపు - కొత్తగా కనిపిస్తోన్న అదా శర్మ
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి