అన్వేషించండి
Guppedantha Manasu Sai Kiran: అప్పుడు వెండితెరపై.. ఇప్పుడు బుల్లితెరపై అదరగొడుతున్న సింగర్ పి.సుశీల మనవడు
image credit : Saikiran/Instagram
1/15

హీరో సాయి కిరణ్ దాదాపు పాతికకు పైగా సినిమాల్లో నటించాడు. నువ్వే కావాలి, ప్రేమించు, దేవి, మనసుంటే చాలు వంటి చిత్రాలతో మెప్పించిన సాయి కిరణ్ ఇప్పుడు సీరియల్స్‌లో బిజీగా ఉన్నాడు. కోయిలమ్మ సీరియల్‌తో పాపులర్ అయిన సాయి కిరణ్.. ప్రస్తుతం ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో హీరోకి తండ్రిగా మహేంద్ర భూషన్ పాత్రలో అదరగొడుతున్నాడు.
2/15

కేవలం తెలుగులోనే కాదు మలయాళంలో కూడా వరుస సీరియల్స్ తో బిజీబిజీగా ఉంటున్నాడు సాయికిరణ్. వాస్తవంగా చెప్పాలంటే వెండితెరపై కన్నా బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో గుప్పె గుప్పెడంత మనసు, కోయిలమ్మ, సుడిగుండాలు, శివలీలలు, సూర్య భగవాన్, అభిలాష... మలయాళంలో వినంబడి, మౌనరాగం సీరియల్స్ తో బుల్లితెరపై అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
Published at : 30 Dec 2021 05:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















