అన్వేషించండి
Pawan Kalyan: సెలూన్ ఓపెనింగ్‌కు పవన్ కళ్యాణ్... అదీ జాగింగ్ డ్రస్‌లో... ఎందుకు వెళ్లారో తెలుసా?
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం విజయవాడలోని పెనమలూరులో ఒక సెలూన్ ఓపెనింగ్ కు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఎందుకు వెళ్లారో తెలుసా?
సెలూన్ ఓపెనింగ్‌కు పవన్ కళ్యాణ్... అదీ జాగింగ్ డ్రస్‌లో... ఎందుకు వెళ్లారో తెలుసా?
1/6

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం విజయవాడలోని పెనమలూరులో ఒక సెలూన్ లాంచ్ చేశారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ బ్రాండ్ అండ్వర్మెంట్స్, షాప్ ఓపెనింగ్స్ వంటి వాటికి దూరంగా ఉంటారు. మరి సెలూన్ ఓపెనింగ్ కి ఎందుకు వెళ్లారో తెలుసా?
2/6

పవన్ కళ్యాణ్ షూటింగ్స్ చేసేటప్పుడు ఆయన దగ్గర రామ్ కొనికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తారు. రామ్ కొనికి హెయిర్ స్టైలిస్ట్. సెలూన్ కొనికి పేరుతో విజయవాడలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. దాన్ని లాంచ్ చేశారు పవన్ కళ్యాణ్.
3/6

పవన్ కళ్యాణ్ సహా అక్కినేని నాగార్జున, అఖిల్, సిద్ధార్థ్ తదితరులకు రామ్ కొనికి హెయిర్ స్టైలింగ్ చేశారు. సెలూన్ కొనికి హైదరాబాదులో కూడా ఉంది. ఇప్పుడు విజయవాడలో మరో బ్రాంచ్ ఓపెన్ చేశారు.
4/6

పవన్ కళ్యాణ్ తన దగ్గర పని చేసే వ్యక్తులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనేది తెలిసిన విషయమే. రామ్ కొనికి కోసం మార్నింగ్ జాగింగ్ డ్రెస్ - షార్ట్ అండ్ టీ షర్టులో సెలూన్ ఓపెనింగ్ కి వచ్చేశారు.
5/6

పవన్ కళ్యాణ్ రావడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేయగా... ఆ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది.
6/6

ఇటీవల పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ పూర్తి చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు.
Published at : 08 Jun 2025 01:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















