అన్వేషించండి
Sukumar Craze: అభిమానం 'పండితే' ఇంతే, వరి పైరుతో సుకుమార్ బొమ్మ, కడప కుర్రాడి క్రియేటివిటీ!
సుకుమార్ రూపం, 'పుష్ప 2' టైటిల్ వచ్చేలా వరిపైరు సాగు చేసిన సువీక్షిత్
1/7

సుకుమార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంది? ఆయనపై ప్రేక్షకుల్లో అభిమానం ఎంత ఉంది? అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సుకుమార్ మీద అభిమానాన్ని కడప కుర్రాడు, 'దూరదర్శిని' సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్ బొజ్జా కొత్తగా చూపించారు.
2/7

సుకుమార్‌కు సువీక్షిత్ బొజ్జా వీరాభిమాని. పాన్ ఇండియా సినిమా 'పుష్ప'తో భారీ విజయం అందుకుని, దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా నిలిచిన సుకుమార్ కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. అభిమాన దర్శకుడిపై ప్రేమతో కడపలోని రెండున్నర ఎకరాల తన సొంత వ్యవసాయ భూమిలో వరి సాగు చేశారు. ఒక వీడియో సాంగ్ కూడా రూపొందించారు. అది చూసిన సుకుమార్ "నా నోట మాట రావడం లేదు.. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?" అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని అభినందించారు.
Published at : 16 Mar 2022 03:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















