అన్వేషించండి
Rashmika Mandanna: జపాన్‌లో రష్మిక - ప్రతి ఏడాది వెళ్లాలిక!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? జపాన్‌లో! అక్కడ జరుగుతున్న Anime Awards 2024కి వెళ్లారు. జపాన్ నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వాటిని మీరూ చూడండి.

రష్మిక మందన్నా ఫోటోలు (Image Courtesy: rashmika_mandanna / Instagram)
1/6

రష్మిక నేషనల్ క్రష్. మరి, ఆవిడ లేటెస్ట్ క్రష్ ఏంటో తెలుసా? యానిమీ! అంటే... యానిమేషన్ ఫిలిమ్స్ అన్నమాట! జపాన్ దేశంలో యానిమేషన్ ఇండస్ట్రీకి మంచి వేల్యూ ఉంది. అక్కడ నుంచి ప్రతి ఏడాది ఎక్కువ యానిమేషన్ ఫిలిమ్స్, వెబ్ సిరీసులు వస్తాయి. యానిమీ అవార్డ్స్ కూడా ఇస్తారు. anime awards 2024కి రష్మిక వెళ్లారు. అక్కడ నుంచి ఫోటోలు షేర్ చేశారు. వాటిని మీరూ చూడండి. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
2/6

యానిమీ 2024 అవార్డుల్లో బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ అవార్డును రష్మిక అనౌన్స్ చేశారు. ఇండియాలో యానిమేషన్ ఫిలిమ్స్ కు మంచి ఆదరణ ఉందని పేర్కొన్నారు. ఆ స్టేజి మీద ఆమెను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
3/6

తన చిన్నతనం నుంచి... కొన్నేళ్లుగా జపాన్ వెళ్లాలని కలలు కంటున్నానని, అయితే ఎప్పుడూ పాజిబుల్ అవుతుందని అనుకోలేదని రష్మిక పేర్కొన్నారు. యానిమీ అవార్డుల్లో ఒకరికి అవార్డు ఇస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఆ కల ఇప్పుడు నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
4/6

జపాన్ ఫుడ్, అక్కడి వాతావరణం, ప్రజలు, స్వచ్ఛమైన ప్రదేశాలు తనకు ఎంతో నచ్చాయని రష్మిక పేర్కొన్నారు. తనకు సాదర స్వాగతం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి ప్రతి ఏడాది జపాన్ వస్తానని అక్కడి ప్రజలకు ఆమె మాట ఇచ్చారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
5/6

ప్రతి ఏడాది రష్మిక జపాన్ వెళ్లాలిక! పుష్ప సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ కూడా బాగా ఆడాయి. ఇండియన్ సినిమాలకు జపాన్ లో క్రేజ్ ఉంది. రష్మికకు కూడా అక్కడ క్రేజ్ ఉంది. సో... ఆమెను మర్చిపోలేరు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
6/6

జపాన్ లో రష్మిక ఫోటోలు (Image Courtesy: rashmika_mandanna / Instagram)
Published at : 03 Mar 2024 02:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion