అన్వేషించండి
Sangeeth Shobhan: నాగ్ అశ్విన్ క్లాప్‌తో మొదలైన సంగీత్ శోభన్ కొత్త సినిమా - ఫోటోలు చూడండి
Sangeeth Shobhan and Nayan Sarika Movie: 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్'తో పాపులరైన సంగీత్ శోభన్ హీరోగా కొత్త సినిమా మొదలైంది. 'కల్కి 2898 ఏడీ'తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు.
సంగీత్ శోభన్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు చూడండి
1/6

Niharika Konidela 2nd Movie As Producer: 'కమిటీ కుర్రోళ్ళు'తో వెండితెరపై నిర్మాతగా నిహారిక కొణిదెల అడుగు పెట్టారు. ఆ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు నిర్మాతగా నిహారిక తన రెండో సినిమాను ప్రారంభించారు. 'కల్కి 2898 ఏడీ'తో పాన్ ఇండియా హిట్ కొట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు ఫస్ట్ క్లాప్ ఇచ్చారు.
2/6

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకం మీద ప్రొడక్షన్ నెం.2గా నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకురాలు. మహేష్ ఉప్పాలతో కలిసి స్క్రీన్ ప్లే, డైలాగ్స్... సొంతంగా కథ రాశారు మానస శర్మ. ఈ చిత్రానికి 'మన్యం' రమేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
3/6

అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‌లో బుధవారం సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ ఇవ్వగా... వశిష్ట మల్లిడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి 'మ్యాడ్ స్క్వేర్' దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.
4/6

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 15న ప్రారంభం కానుంది. హైదరాబాద్ సిటీ, పరిసర ప్రాంతాల్లో జరగనుంది.
5/6

ఫాంటసీ కామెడీ జోనర్ తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడు. త్వరలో ఇతర వివరాలు అనౌన్స్ చేస్తామని తెలిపారు.
6/6

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం2గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ ఫోటోలు చూడండి.
Published at : 02 Jul 2025 05:27 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















