అన్వేషించండి
Nandamuri Balakrishna: బాలయ్య దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? - ఆయన కార్ల కలెక్షన్ ఇదిగో, వాటి ధరెంతో తెలిస్తే షాకావ్వాల్సిందే!
Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా రేపు సినీ పెద్దలు బాలయ్య గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేస్తూ ఆయనను ఘనం సత్కరించనున్నారు.

Image Credit: manabalayya/Instagram
1/8

Balakrishna Car Collection: నందమూరి బాలకృష్ణ నటుడిగా తన సినీ కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. బాలయ్య నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు ఆయనకు గోల్డెన్ జూబ్లీ వేడుకకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. (Image Credit: manabalayya/Instagram)
2/8

సినీ పెద్దలంతా కలిసి ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఆయన గోల్డెన్ జూబ్లీకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహరథులంతా హాజరుకానున్నారు. (Image Credit: manabalayya/Instagram)
3/8

నెల రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను డిజైన్ చేయించారు. ఇప్పటికే సినీ ప్రిముఖులు, నటీనటులందరికి ఆహ్వానం అందింది. (Image Credit: manabalayya/Instagram)
4/8

ఈ సందర్భంగా బాలయ్య సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ఆస్తులు, ఆయన కార్ల కలెక్షన్, ఇష్టమైన ఫుడ్, ఆయన సినిమాలకు సంబంధించిన వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (Image Credit: manabalayya/Instagram)
5/8

అయితే బాలయ్య వద్ద ఉన్న కార్లు కలెక్షన్స్పై కొందరు ఆరా తీస్తున్నారు. పెద్దగా కార్ల అంటే ఇష్టం ఉండని ఆయన దగ్గర దాదాపు రూ. 20 కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇటీవల ఆయన కూతురు బ్రాహ్మణి ఆయనకు బెంట్లి కాంటినెంటల్ కారుని గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. (Image Credit: manabalayya/Instagram)
6/8

దీనితో కలిపి మరో మూడు కార్లు ఉన్నాయట. అందులో ఒకటి బీఎండబ్ల్యూ 6 సీరిస్ జీటి (BMW 6 Series GT, మెర్సిడెస్ బెంజ్ GLS 400d (Mercedez Benz GLS 400d), టయోట ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crista) కార్లు ఉన్నాయి. (Image Credit: manabalayya/Instagram)
7/8

అంతేకాదు బాలయ్య ఆస్తులు కూడా బాగానే ఉన్నాయట. హైదరాబాద్లో రెండు లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. ఇక తనతండ్రి వారసత్వంగా వందల ఎకరాల భూములు వాటాగా వచ్చినట్టుల తెలుస్తోంది. ఇక హైదరాబాద్లోని మూవీ థియేటర్లు, స్టూడియోలు కూడా ఆయన పేరు మీదే ఉన్నాయట.
8/8

Nandamuri Balakrishna: బాలయ్య దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? - ఆయన కార్ల కలెక్షన్ ఇదిగో, వాటి ధరెంతో తెలిస్తే షాకావ్వాల్సిందే!
Published at : 31 Aug 2024 04:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion