అన్వేషించండి
Indian 2 Audio Launch: 'ఇండియన్ 2' ఆడియో లాంచ్‌లో హైలైట్స్ - శంకర్ కోసం ఆ కథ పక్కన పెట్టేసిన కమల్
Kamal Haasan: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌తో రెడ్ జెయింట్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన 'భారతీయుడు 2' ఆడియో విడుదల జూన్ 1న చెన్నైలో జరిగింది. అందులో హైలైట్స్!
'ఇండియన్ 2' ఆడియో ఆవిష్కరణలో సినీ ప్రముఖులు
1/9

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ కలయికలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ మీద తెరకెక్కిన సినిమా 'ఇండియన్ 2'. దీనిని తెలుగులో 'భారతీయుడు 2'గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. 'భారతీయుడు 2' తెలుగు వెర్షన్ (తెలంగాణ ప్లస్ ఆంధ్ర) థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. శనివారం (జూన్ 1న) చెన్నైలో ఘనంగా ఆడియో వేడుక నిర్వహించారు. హీరో శింబు, దర్శకులు లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అందులో హైలైట్స్ చూడండి.
2/9

కమల్ హాసన్ మాట్లాడుతూ... ''నేను 28 ఏళ్ల క్రితం శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాలి. ఆ సమయంలోనే శంకర్ 'ఇండియన్' కథతో వచ్చారు. ఆ రెండు కథలు మధ్య కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి. ఆ విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పా. 'శంకర్‌తో సినిమా చెయ్యండి. ఆల్రెడీ ఆయనో సినిమా తీశారు. మనం ఎన్నో సినిమాలు చేశాం’ అన్నారు. ఆయన మాట, నమ్మకంతో 'ఇండియన్' చేశా. మా మధ్య అప్పుడు రెమ్యూనరేషన్స్ డిస్కషన్ జరగలేదు. ఏఎం రత్నం గారు చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. అప్పుడే సీక్వెల్ గురించి అడిగా. శంకర్ కథ రెడీగా లేదన్నారు. 28 ఏళ్ల తర్వాత మేం మళ్లీ 'ఇండియన్ 2' చేశాం. ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చిందంటే లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గారే కారణం. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే మాకు అండగా నిలిచారు. అనిరుధ్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆయన సంగీతంలో ఒక ఎనర్జీ ఉంటుంది. 'ఇండియన్'కు మేకప్ ఆర్టిస్టుగా పని చేసిన హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో మళ్లీ పని చేయడం హ్యాపీగా ఉంది'' అని చెప్పారు.
Published at : 02 Jun 2024 09:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















