అన్వేషించండి
Bharateeyudu 2: భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసిన స్టార్స్ - కమల్ నుంచి రకుల్, బ్రహ్మి వరకు
Bharateeyudu 2 Pre Release Event Photos: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన 'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. అందులో సందడి చేసిన స్టార్స్ ఎవరో చూడండి.

హైదరాబాద్ సిటీలో జరిగిన 'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేసిన స్టార్స్ ఫోటోలు చూడండి.
1/13

Kamal Haasan At Bharateeyudu 2 Pre Release Event: లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా సినిమా 'భారతీయుడు 2'. తమిళంలో 'ఇండియన్ 2'గా, హిందీలో 'హిందుస్థానీ 2'గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఆదివారం (జూలై 7న) హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
2/13

జూలై 12న ప్రపంచవ్యాప్తంగా 'భారతీయుడు 2' విడుదల అవుతోంది. సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్. తెలుగునాట కూడా సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
3/13

'భారతీయుడు 2' సినిమా కోసం కమల్ హాసన్ ఎంతో కష్టపడ్డారని దర్శకుడు శంకర్ పేర్కొన్నారు. కమల్ తరహాలో ప్రపంచంలో ఎవరూ నటించలేరని ఆయన చెప్పారు.
4/13

'భారతీయుడు 2' ప్రజల సినిమా అని కమల్ హాసన్ తెలిపారు. ఇప్పటి తరానికి తగ్గట్టు సినిమా తీశామని, తాను సైతం ఈ సినిమాకు అభిమాని అని ఆయన చెప్పారు. ఏసియన్ సురేష్, శ్రీలక్ష్మీ మూవీస్ 'భారతీయుడు 2'ను తెలుగులో విడుదల చేస్తున్నారని ఆయన వివరించారు.
5/13

''ఇరవైయేళ్ల క్రితం 'బాయ్స్' ఆడియో వేడుకకు హైదరాబాద్ వచ్చా. అప్పుడు నన్ను హీరో చేసి శంకర్ గారు సినిమా తీశారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ప్రతి భారతీయుడికి ఈ 'ఇండియన్ 2' ఎక్కుతుందని నన్ను మళ్లీ హీరోగా తీసుకు వచ్చారు. నాకు ఇష్టమైన హీరో కమల్ హాసన్ గారితో నటించడం ఆనందంగా ఉంది'' అని సిద్ధార్థ్ చెప్పారు.
6/13

కమల్ హాసన్, శంకర్... ఇద్దరితో కలిసి పని చేయాలనే కల ఈ సినిమాతో తీరిందని రకుల్ సంతోషం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ తో కలిసి మళ్ళీ నటించాలని ఉందన్నారు.
7/13

'భారతీయుడు 2'లో బ్రహ్మానందం అతిథి పాత్రలో నటించారు. ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు శంకర్, బ్రహ్మి ఫోటో
8/13

'భారతీయుడు 2'లో చిన్న పాత్రలో, 'భారతీయుడు 3'లో పెద్ద పాత్రలో ఎస్.జె. సూర్య కనిపించనున్నారు.
9/13

నటుడు, దర్శకుడు సముద్రఖని సైతం 'భారతీయుడు 2'లో నటించారు. ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన కూడా సందడి చేశారు.
10/13

'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ వేడుకలో కమల్ హాసన్ వాయిస్ యాజిటీజ్ దించేశారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
11/13

'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేస్తున్న కమల్ హాసన్, సిద్ధార్థ్
12/13

తెలుగు అబ్బాయి, తమిళ సినిమాలతో పాపులరైన బాబీ సింహ సైతం 'భారతీయుడు 2' సినిమాలో కీలక పాత్రలో నటించారు.
13/13

ఒక వైపు కళాతపస్వి కె విశ్వనాథ్, మరొక వైపు బాలచందర్... తనలో నటుడిని వెలికి తీసిన ఇద్దరు దిగ్గజ దర్శకుల మధ్యలో కమల్ హాసన్... ఈ ఫోటోను యువి మీడియా లోకనాయకుడికి ఇచ్చేసింది.
Published at : 08 Jul 2024 10:25 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion