అన్వేషించండి
Alia Bhatt Saree: అంబానీ పెళ్లిలో అందరి కళ్లన్ని అలియా శారీపైనే - 160 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ చీర ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Alia Bhatt Saree Details: అంబానీ పెళ్లిలో అలియా భట్ ధరించిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చూడటానికి సింపుల్‌గా ఉన్న ఈ చీర ప్రత్యేకతలు తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

Image Credit: aliaabhatt/Instagram
1/7

Alia Bhatt Wear 160 Years Old Silk Saree: భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకులు ముగిశాయి. ఈ పెళ్లిలో అలియా-రణ్‌బీర్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
2/7

ముఖేష్ అంబానీ, నితూ అంబానీల చిన్న కుమారుడు ఆకాశ్ అంబానీ, రాధిక మార్చంట్‌లు జూలై 12న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్స్, గ్లోబల్ స్టార్స్ హాజరయ్యారు.
3/7

బాలీవుడ్ మొత్తం అంబానీ ప్రతి పెళ్లి వేడుకల్లో కనిపించారు. ఖాన్, కపూర్ హీరోలంతా హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
4/7

అంతా జిగెల్ మనెలా ఎంబ్రాయిడరి, మిర్రర్ వర్క్ హెవీ డిజైనర్ వేర్‌లో వస్తే.. అలియా మాత్రం సింపుల్‌గా పింక్ కలర్ జెర్రి బార్డర్ పట్టు చీరలో వచ్చింది. రణ్‌బీర్ ట్రెడిషనల్ శర్వాణీలో వచ్చారు. ఈ పెళ్లి సంప్రదాయ దుస్తుల్లో పర్ఫెక్ట్ కపుల్‌గా నిలిచారు రణ్‌బీర్-అలియా.
5/7

అయితే అందరి కళ్లు అలియా చీరపైనే పడ్డాయట. సింపుల్ కనిపించే ఈ చీర వెనక పెద్ద స్టోరీనే ఉంది. అంతేకాదు దీని ప్రత్యేకత తెలిసి అంత సర్‌ప్రైజ్ అవుతున్నారట. చూడటానికి సింపుల్‌గా కనిస్తున్న ఈ చీరలో స్వచ్చమైన బంగారం, వెండితో తయారు చేశారట.
6/7

ఈ చీర 160 ఏళ్ల నాటిది. దీనికి డిజైన్ కోసం నిజమైన బంగారం, వెండిని ఉపయోగించారట. 160 ఏళ్ల క్రితం గుజరాత్‌లో నేసిన ఆశావళి స్వచ్చమైన పట్టుచీర ఇది. దీని తయారిలో 99 శాతం స్వచ్చమైన వెండితో కూడిన జరీ బార్డర్‌తో రూపొందించింది.
7/7

ఈ చీరకు రీగల్ లుక్ అందించడానికి సుమారు 6 గ్రాముల బంగారాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇక ఈ చీర ప్రత్యేకత తెలిసి ఆడవాళ్లంతా కంగుతింటున్నారు.
Published at : 13 Jul 2024 09:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion