అన్వేషించండి
PF For Interns: ఇంటర్న్ లేదా ట్రైనీగా చేరితే కంపెనీ పీఎఫ్ జమ చేస్తుందా? రూల్స్ ఇవీ!
Intern Epf Rules: ఇంటర్న్ లేదా ట్రైనీగా చేరితే కంపెనీ పీఎఫ్ జమ చేస్తుందా? అసలు చట్టంలో ఏముంది? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఈపీఎఫ్‌వో
1/5

ఉద్యోగంలో చేరిన వెంటనే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా తెరవడం సర్వసాధారణం! అలాగే నెల నెలా వేతనంలో కొంత శాతం పీఎఫ్‌లో జమ చేస్తుంటారని తెలిసిందే. మరి ఇంటర్న్ లేదా ట్రైనీగా చేరితే పీఎఫ్ జమ చేస్తారా? అసలు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసా!
2/5

కొత్తగా ఇంటర్న్ లేదా ట్రైనీగా చేరితే పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయాలో లేదో భవిష్య నిధి చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. అయితే 2015లో మాత్రం ఈపీఎఫ్‌వో రెండు ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పరిమితులను అనుసరించి పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయొచ్చని వెల్లడించింది.
3/5

ప్రభుత్వ గుర్తింపు పొందిన కోర్సు, విద్యాసంస్థలో భాగంగా ఏదైనా కంపెనీలో ట్రైనీగా చేరితే ఈపీఎఫ్ చట్ట ప్రకారం పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేసేందుకు వీల్లేదు. కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేసినా ఇదే నిబంధన వర్తిస్తుంది.
4/5

ఒకవేళ ఆ ఇంటర్న్ శిక్షణ ముగించుకొని కంపెనీలో చేరినప్పటికీ స్టైఫండ్ నుంచి పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. శాశ్వత ఉద్యోగిగా చేరితే, ట్రైనీగా ఉన్నా అతడి వేతనం నుంచి పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయాల్సిందే.
5/5

ఈఎఫ్‌వో 2022, జులైలో విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇంటర్న్‌షిప్ చేస్తున్నా, కోర్సులో భాగంగా ఆన్ ది జాబ్ ట్రైనింగ్‌లో ఉన్నా, కోర్సులో భాగంగా నిర్దేశిత సమయంలో విద్యార్థి శిక్షణ ముగించినా స్టైఫండ్ నుంచి పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేసేందుకు వీల్లేదు.
Published at : 25 Aug 2022 11:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion