అన్వేషించండి
Pawan Chandrababu Photos: పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కీలక భేటీ, టార్గెట్ మాత్రం ఫిక్స్
Pawan Chandrababu Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఏపీలో రాజకీయాలు, సీట్ల సర్దుబాటుపై కీలకంగా చర్చించారు.

పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కీలక భేటీ, చర్చించిన అంశాలివే!
1/4

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి వెళ్లారు.
2/4

మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నందున పవన్, చంద్రబాబు భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై జనసేనానితో చంద్రబాబు చర్చించేందుకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ మేనిఫెస్టో, లేక ఉమ్మడి మేనిఫెస్టోనా అనే అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
3/4

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. చంద్రబాబు ఆ సమయంలో జైలులో ఉండటం, మరోవైపు కేవలం ఏపీపైనే ఫోకస్ చేస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనూ రాజమండ్రికి వెళ్లి పవన్ కళ్యాణ్.. నారా లోకేష్, బాలకృష్ణతో వెంట వెళ్లి చంద్రబాబును పరామర్శించారు.
4/4

పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య దాదాపు గంటపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టత గురించి సమాలోచనలు చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ దిశగా చర్చలు జరిపామన్నారు. చర్చలు సంతృప్తికరంగా జరిగాయని.. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. టీడీపీ, జనసేన క్యాడర్ కలిసి పనిచేస్తుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు మనోహర్.
Published at : 17 Dec 2023 11:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion