అన్వేషించండి
TDP Janasena News: జగన్ చేతిలో చిప్ప పట్టుకొని పోతాడు, మేం చేసి చూపిస్తాం - తణుకు సభలో చంద్రబాబు వార్నింగ్
AP Elections 2024: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ - జనసేన కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇందులో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ జగన్ పాలనను భూస్తాపితం చేస్తామని అన్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్
1/9

తణుకు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్నారు.
2/9

మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైసీపీని, జగన్‌ని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు అన్నారు. తనకు అనుభవం ఉందని.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందని చంద్రబాబు మాట్లాడారు
3/9

తమ జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అని.. జగన్ చీకటి పాలనను పారద్రోలడానికి ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే తాము చేతులు కలిపామని చెప్పారు. ఈ విషయం తనకు మొదట ప్రతిపాదించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అన్నారు.
4/9

యువత కన్నెర్ర చేస్తే జగన్ మోహన్ రెడ్డి లండన్ కు పారిపోతాడు. జగన్ చేతిలో చిప్ఫ పట్టుకుని ఎటు పోతాడో నేను అప్పుడే చెప్పను.. పవన్ కళ్యాణ్, నేను కలిసి అది చేసి చూపిస్తాం. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై మేం తొలి సంతకం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
5/9

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని అన్నారు.
6/9

అలాంటి వ్యక్తి అనుభవం ఏపీ రాష్ట్రానికి అవసరం అని.. ఆంధ్రా యువత భవిష్యత్తు బాగుండాలనే తాను కొంత వెనక్కి తగ్గానని అన్నారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తనకు తెలుసు అని పవన్ కల్యాన్ మాట్లాడారు.
7/9

పంట ధాన్యంలో మొలకలు వచ్చాయని రైతులు ఏడుస్తుంటే.. స్థానిక మంత్రి ఒకరు బూతులు తిట్టిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు.
8/9

ఆ సమయంలో జనసైనికుల ఒంటిపై పడ్డ దెబ్బలను తాను మర్చిపోలేదని అన్నారు. జగన్ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు మరికొద్ది రోజుల్లోనే వస్తాయని అన్నారు.
9/9

పోలీసులకు కూడా జగన్ అన్యాయం చేశాడని పవన్ విమర్శించారు. 70 వేల పోలీసు కుటుంబాలకు టీఏ, డీఏలు, సరెండర్ లీవ్స్ ఇవ్వలేదని.. వారి శ్రమను జగన్ దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.
Published at : 10 Apr 2024 08:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion