అన్వేషించండి

YSR Sunna Vaddi: వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ - నేడు రూ.1,353.76 కోట్లు జమ

YSR Sunna Vaddi: వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను ఈరోజు విడుదల చేయబోతున్నారు. మొత్తం కోటి 5 లక్షల 13 వేల 365మందికి రూ.1,353.76 కోట్ల డబ్బును జమ చేస్తున్నారు. 

YSR Sunna Vaddi: వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కాచెల్లెల్లు బ్యాంకులకు చెల్లించి రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయంబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం జగన్ బటన్ నొక్కి మరీ నగదు జమ చేయనున్నారు. ఈ రూ.1,353.76 కోట్లతో కలిపి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటి వరకు అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు అవుతుంది. పేద అక్కా, చెల్లెల్లకు సాధికారత కల్పిస్తూ.. వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతం ఇచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగు పరుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 

సుస్థిరాభివృద్ధికి వైసీపీ సర్కారు బాటలు

ఈక్రమంలోనే బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కాచెల్లమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరఫున ఆ భారాన్ని వైఎస్సార్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అక్కాచెల్లమ్మలు వారి కాళ్ల మీదు వారు నిలబడేలా.. జీవనోపాధి మెరుగు పడేలా బహుళ జాతి దిగ్గజ కంపెనీలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థిక అభివృద్ధికి వైఎస్ జగన్ సర్కారు బాటలు వేసింది. ప్రభుత్వం చొరవ తీసుకొని బ్యాంకులతో మాట్లాడి వడ్డీ రేట్ల తగ్గించడంతో అక్కా చెల్లమ్మలపై రూ.1,244 కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. దీంతో ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుకుని వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ రుణాల రికవరీలో 99.67 శాతంతో దేశంలోని ప్రథమ స్థానంలో నిలిచారు. 

మొత్తం 16 లక్షల 44 వేల 29 మందికి నెలనెలా ఆదాయం

ప్రభుత్వ సాయంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర దుకాణాలు, కుట్టు మిషన్లు, వస్త్ర వ్యాపారాలు.. ఇలా అనేక రకాల పనులు చేసుకుంటూ వారి కాళ్ల మీద వారు నిలబడుతున్నారని తెలుస్తోంది. ఇలా మొత్తంగా 16,44,029 మంది అక్కచెల్లమ్మలకు నెలకు 7 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తోందని వైసీపీ అధికార ప్రతినిధులు చెబుతున్నారు. అమూల్ తో ఒప్పందం కారణంగా మార్కెట్ లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.20 వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోందని అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget