Viral Video: నడిరోడ్డుపై తుపాకీ పట్టుకుని డ్యాన్స్‌లు, రీల్స్ కోసం ఇన్‌ఫ్లుయెన్సర్ పిచ్చి చేష్టలు - వీడియో వైరల్
Viral Video: ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్స్ కోసం నడిరోడ్డుపై తుపాకీ పట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Influencer Dances With Gun: ఇన్‌స్టా రీల్స్ కోసం కొందరు ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. రకరకాల సాహసాలు చేస్తున్నారు. వ్యూస్ కోసం రీల్స్ చేసి వివాదంలో ఇరుక్కుంటున్నారు. ఓ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇలాగే చేసి పోలీసుల ఆగ్రహానికి లోనైంది. లఖ్నోలో హైవేపై గన్ పట్టుకుని డ్యాన్స్ చేస్తూ రీల్ షూట్ చేసింది. ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్‌లు తీవ్రంగా మండి పడుతున్నారు. గన్‌తో డ్యాన్స్ ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోలో యూట్యూబర్ సిమ్రన్ యాదవ్ (Simran Yadav) నడిరోడ్డుపై తుపాకీ చేతిలో పట్టుకుని డ్యాన్స్ వేస్తూ కనిపించింది. రీచ్ కోసం ఇలా చేసింది. ఈ వీడియో వైరల్ అవడం వల్ల లఖ్నో పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకున్నారు. ఓ అడ్వకేట్ ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భోజ్‌పురి పాటకి ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ నడిరోడ్డుపై ఇలా డ్యాన్స్ చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. గన్ చేతిలో పట్టుకుని మిస్ హ్యాండిల్ చేసిందంటూ ఫైర్ అయ్యారు.
"ఇన్‌స్టాగ్రామ్ స్టార్, యూట్యూబర్ సిమ్రన్ యాదవ్ ఇలా లఖ్నోలో నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది. అది కూడా చేతిలో తుపాకీతో. రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసింది. వాళ్ల కమ్యూనిటీ గురించి చెప్పుకునే పద్ధతి ఇదా..? ఇంత చేస్తున్నా అధికారులు మాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది"
- అడ్వకేట్
instagram star सिमरन यादव लखनऊ सरेआम नियम कानून व आचार संहिता की धज्जियाँ उड़ाते हुए highway पर पिस्टल को लहराकर video वायरल करके समाज में अपनी बिरादरी का रौब जमा रहीं हैं परंतु अधिकारी चुप्पी साधे हुए है l @dgpup @ECISVEEP @Splucknow_rural @Igrangelucknow @adgzonelucknow @myogi pic.twitter.com/GN4zWsc1P9
— Advocate kalyanji Chaudhary (@DeewaneHindust1) May 9, 2024
ఈ వీడియో వైరల్ అవడం వల్ల లఖ్నో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అటు నెటిజన్‌లు మాత్రం ఇన్‌ఫ్లుయెన్సర్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రోడ్డుపైన గన్‌తో ఏంటీ పిచ్చి డ్యాన్స్‌లు అని కామెంట్లు పెడుతున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
संबधिंत को आवश्यक कार्यवाही हेतु निर्देशित किया गया है।
— LUCKNOW POLICE (@lkopolice) May 9, 2024