Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‌కి హైకమాండ్ వార్నింగ్! అనవసర వ్యాఖ్యలు చేయొద్దని మందలింపు!
Wrestlers Protest: రెజ్లర్ల విషయంలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని బ్రిజ్ భూషణ్‌కి హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Wrestlers Protest:
ర్యాలీ రద్దు..
బ్రిజ్ భూషణ్ వర్సెస్ రెజ్లర్ల వివాదంలో ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న బీజేపీ హైకమాండ్ ఇప్పుడు యాక్షన్‌లోకి దిగినట్టే కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...రెజ్లర్ల ఆందోళనలపై "అనవసర వ్యాఖ్యలు" చేయొద్దని బ్రిజ్ భూషణ్‌ని హైకమాండ్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అంతే కాదు. జూన్ 5వ తేదీన భారీగా ర్యాలీ చేపట్టాలని భూషణ్ డిసైడ్ అయినా...అధిష్ఠానం మాత్రం అందుకు అంగీకరించలేదు. ర్యాలీ చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన తరవాతే ఆయన ఉపసంహరించుకున్నట్టు సమాచారం. అయోధ్యలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటే...అది కాస్తా సైడ్ అయిపోయింది. ఫేస్‌బుక్‌లో ఇదే విషయం వెల్లడించారు బ్రిజ్ భూషణ్. అనివార్య కారణాల వల్ల ర్యాలీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
"నేను 28 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎంపీగా మీ అందరికీ చేరువయ్యాను. అన్ని వర్గాలకు చెందిన ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాను. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ నా వైఖరి మారలేదు. కానీ...నాపై మాత్రం కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారని తెలుసు. మతసామరస్యాన్ని దెబ్బ తీయాలనీ కొందరు చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగానే అయోధ్యలో జూన్ 5వ తేదీన సనాతన సమ్మేళన్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. కానీ...పోలీసుల విచారణ, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఈ ర్యాలీని వాయిదా వేస్తున్నాను. ఇప్పటి వరకూ నాకు మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను"
- బ్రిజ్ భూషణ్ సింగ్, బీజేపీ ఎంపీ
రెండు ఎఫ్‌ఐఆర్‌లు...
ఢిల్లీ పోలీసులు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్ భూషణ్‌పై రెండు FIRలు నమోదు చేశారు. రెజ్లర్ల స్టేట్‌మెంట్స్ ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఈ FIRలతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
"WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నట్టు ఆరోపణలున్నాయి. శ్వాస సరిగ్గా ఉందో లేదో అని తెలుసుకునేందుకు అసభ్యంగా తాకారు. ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేశారు. టోర్నమెంట్‌లలో గాయాలైతే వాటికి అయ్యే వైద్య ఖర్చులు తానే భరిస్తానని చెప్పిన బ్రిజ్ భూషణ్..ఇలా చేయాలంటే తనతో సెక్స్ చేయాలని కండీషన్ పెట్టారు. మైనర్ రెజ్లర్‌ని కూడా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నారు"
- FIRలలో ఉన్న వివరాలు
కేసులు నమోదు చేసి...ఆయనను అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారన్న ప్రశ్నిస్తున్నారు రెజ్లర్లు. దీనికి పోలీసులు వివరణ ఇస్తున్నారు. లైంగిక ఆరోపణలు చేసినట్టు ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే అరెస్ట్ చేయలేదని తేల్చి చెబుతున్నారు. మరో 15 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి కోర్టుకి ఓ నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. సాక్ష్యాధారాల కోసం పలు డాక్యుమెంట్‌లు పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన వారిలో ఓ మైనర్ కూడా ఉంది. అందుకే...పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే...ఆ అమ్మాయి మైనర్ కాదని ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఆధారాలు ఇచ్చాడు. ఆ అమ్మాయి మైనర్ కాదు అని నిరూపించే కీలక వివరాలు బయటకు వచ్చాయి. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాలి మలివాల్ మండి పడ్డారు. మైనర్ వివరాలు బయటకు ఎలా వచ్చాయంటూ డీసీపీకీ నోటీసులిచ్చారు.
Also Read: Akhand Bharat Map: మోదీ సర్కార్ "అఖండ భారత్" వ్యూహం, పాకిస్థాన్‌ని టెన్షన్ పెడుతున్న మ్యాప్