Ukraine Videos : ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల పరిస్థితి దారుణం ! ఈ వీడియోలు చూస్తే పుతిన్ ఏమైపోతారో...
ఉక్రెయిన్‌లోకి అడుగు పెట్టిన రష్యా సైనికులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యానికి బందీలుగా దొరుకుతున్నారు. రష్యా సైనికుల దుస్థితి వీడియోల రూపంలో బయటకు వస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై దుందుడుకుగా దాడికి దిగిన రష్యాకు ఏదీ కలసి రావడం లేదు. పెద్ద ఎత్తున సైన్యం ఉక్రెయిన్ సైనికులకు బందీగా చిక్కుతోంది. పెద్ద ఎత్తున ఆయుధాలను కోల్పోతోంది. కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వీడియోలు ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. రష్యా పట్టు బిగించిందని చెప్పుకుంటున్న ఖార్కివ్‌లోనే పెద్ద ఎత్తున సైనికులు ఉక్రెయిన్ చేతికి చిక్కారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Ukraine soldiers captured Russian army. Somewhere near Kharkov. pic.twitter.com/06nhzSSR0P
— Utomilan (@GodwinUtomi) March 1, 2022
ఇక రష్యా సైనిక వాహనాలకు ఎక్కడా గ్యారంటీ ఉండటం లేదు.ఎక్కడ కనిపిస్తే అక్కడ నిప్పు పెడుతున్నారు ఉక్రెయిన్ వాసులు.
Another Russian military truck hit by a Molotov cocktail#Russia #Ukraine
— Pierre Davide Borrelli (@PierreDBorrelli) March 1, 2022
pic.twitter.com/uo57CxogkJ
రష్యా సైన్యాన్ని ఆపడానికి ప్రతి ఒక్క ఉక్రెనియన్ పౌరుడు ఓ సైనికుడు అవుతున్నాడు. యుద్ధ ట్యాంకుల్ని సైతం అవలీలగా ఆపేస్తున్నారు.
Unarmed Ukrainian civilians blocking the road and forcing a Russian tank to turn around. This can be seen: Ukrainians are very brave; some Russian soldiers are kind and hate the Ukraine war, and won't kill civilians indiscriminately! #Russia #Ukraine pic.twitter.com/XyJijU8DFE
— Ukraine VS Russia Breaking News! (@UkraineVSRussi1) March 1, 2022
రష్యా సైనికులతో ఉక్రెయిన్ పోరాటయోధుల సాహసోపేత యుద్ధ దృశ్యాన్ని వారి ధైర్యాన్ని ప్రపంచం ముందు ఉంచుతున్నాయి.
Combat footage of Ukrainian special forces engaging a Russian tank near #Kyiv #Russia #Ukraine #UkraineRussiaWar pic.twitter.com/n3p7YXyLii
— Volodymyr Zelenskyy Fan Page (@Volodymyr_Zelen) March 1, 2022
ఉక్రెయిన్ వీధుల్లో ఇప్పుడు బుల్లెట్ పోరాటాలే కాదు.. మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు రష్యా సైనికుల వద్ద సమాధానం ఉండటం లేదు
#Ukraine "We had peace until you came. Nobody offends us, I speak Russian." Ukrainians in Berdyansk are addressing Russian soldiers. I wish Russians in their country who believed in propaganda watched this. Perhaps the anti-war movement in the country would have been stronger pic.twitter.com/T4JmEnS5uq
— Hanna Liubakova (@HannaLiubakova) February 28, 2022
ఉక్రెయిన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా రష్యా యుద్ధ ట్యాంకుల అవశేషాలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ రష్యా ఎంత దారుణంగా నష్టపోయిందో వివరించడానికి సాక్ష్యాల్లా ఉన్నాయి .
#Ukraine: The Russian Army lost 2 more T-72B3(M), with location so far unknown to us.
— 🇺🇦 Ukraine Weapons Tracker (@UAWeapons) February 28, 2022
Note that once again the HMG have been stripped, probably for local use. pic.twitter.com/TowZw5MMDm
ఎంత బలవంతుడైనా యుద్ధం అనేది చేస్తే .. సాధించేదేమీ ఉండదని... నష్టం కూడా ఉంటుందని రష్యాని చూస్తే అర్థమైపోతుంది.