By: ABP Desam | Updated at : 25 May 2022 09:31 PM (IST)
కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
World Loans : అప్పులు.. అరప్పులు ఇప్పుడు రాష్ట్రాలు.. కేంద్రం .. ఇతర దేశాల్లోనూ ఇవే అరుపులు వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల అప్పు 2021నాటికి రూ. 23100 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించారు. ఆయా దేశాలు చేస్తున్న రుణాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని హెచ్చరించింది. చేసిన రణాలకు సంబంధించి వాయిదాల చెల్లింపుల కోసం ఆయా దేశాల్లో కీలకమైన ప్రభుత్వ సేవలకు కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఐఎంఎఫ్ తాజా నివేదిక లో వెల్లడించింది.
వంద దేశాల్లో రుణ సంక్షోభం
దాదాపు 100కు పైగా దేశాలు రుణ వాయిదాల చెల్లింపు కోసం కీలకమైన ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యంపై వ్యయాన్ని తగ్గించుకోనున్నాయని అంచనా వేసింది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, కుటుంబాలు, వ్యాపారవేత్తలు చేసిన అప్పుల్ని 'గ్లోబల్ డెట్'గా పేర్కొంటారు. ఈ గ్లోబల్ డెట్ ప్రపంచ దేశాల మొత్తం రుణాలు 2021 నాటికి 303 ట్రిలియన్ డాలర్లు అంటే రూ.23100 లక్షల కోట్లుకు చేరుకుంది. అంత క్రితం గ్లోబల్ డెట్ 226 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. రుణాలు ఒక్క ఏడాదిలో రికార్డ్‌స్థాయిలో మునుపెన్నడూ లేనంతగా పెరిగాయని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈస్థాయిలో అప్పులు ఎప్పుడూ పెరగలేదని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది.
కోవిడ్ తర్వాత పెరిగిపోయిన అప్పులు
కోవిడ్-19 సంక్షోభం ఆయా దేశాల్ని అనివార్యంగా అప్పుల ఊబిలో కూరుకపోయేలా చేసింది. ఈ సమస్యను ఉక్రెయిన్ సంక్షోభం మరింత పెంచింది. గ్లోబల్ డెట్‌లో తక్కువ ఆదాయమున్న దేశాలు చేసిన అప్పులు, కుటుంబ రుణాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.కోవిడ్‌కు ముందే గ్లోబల్ డెట్ పెద్ద మొత్తంలో ఉంది. కానీ కోవిడ్ తర్వాత అది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అభివృద్ధి చెందిన దేశాలు, చైనా సైతం రుణాలు చేయాల్సి వచ్చింది. మూడో ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలపై రుణ ప్రభావం తీవ్రస్థాయిలో ఉండబోతోందని ప్రపంచ బ్యాంక్ పరిశోధన కూడా తెలిపింది.
తేడా వస్తే ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యమే
అయితే రుణాలు పెరిగాయి కానీ... రుణాల లభ్యత సంక్షోభం మాత్రం ఏర్పడే పరిస్థితులు కనిపించడం లేదని అంతర్జాతీయ ద్రవయనిధి సంస్థ చెబుతోంది. కానీ రుణఆలు పొందే అర్హతలు ఆయా దేశాలకు తగ్గిపోతున్నాయని దీని వల్ల మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అల్పాదాయ దేశాల్లో 60శాతం రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయట. ఇవి చేతులెత్తేస్తే సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం ఉంది.
India-China Border: చైనా కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది, భారత్‌కే మా ఫుల్ సపోర్ట్ - అమెరికా
Solar Storm : దూసుకొస్తున్న సౌర తుఫాను-నేడు భూమిని తాకే అవకాశం, నాసా హెచ్చరిక
Operation Amritpal: అమృత్ పాల్ సింగ్ అక్కడే లొంగిపోతాడంటూ నిఘా సంస్థల నివేదికలు
Donald Trump Arrest: ట్రంప్ పోలీసుల ముందు లొంగిపోతారా? మొండి పట్టు పడతారా?
Ajay Banga: ప్రపంచ బ్యాంక్ చీఫ్ పదవికి ఏకైక నామినేషన్ - అజయ్ బంగాకు లైన్ క్లియర్
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?