World Record: ఆయన కళ్ళప్పగించి చూస్తే గిన్నిస్ రికార్డే పగిలిపోయింది
కనుగుడ్లు పెద్దవి చేసి అవతలి వ్యక్తులను చూస్తే అవతలి వ్యక్తి భయపడాతోడో లేదే తెలియదు కానీ.. మీకు మాత్రం కనుగుడ్లు నొప్పి పెడతాయి. ఓ వ్యక్తి మాత్రం అలా కళ్లప్పగించి చూసి రికార్డు సృష్టించారు.
World Record: ప్రపంచం చాలా వింత వ్యక్తులతో నిండి ఉంది. ఏదో ఒకటి డిఫరెంట్‌గా చేయాలనే క్రేజ్ ఉన్న వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు చాలా మంది వింతైన ప్రపంచ రికార్డులు కూడా సృష్టించారు. అటువంటి రికార్డు ఒకటి బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి పేరు మీద ఉంది. అలాంటి అరుదైన రికార్డ్ హోల్డర్‌ను మీకు పరిచయం చేయబోతున్నాము. తన కళ్ళతో ఒక ప్రపంచ రికార్డును సృష్టించారు. ఈ ఫీట్‌ను చూస్తే మాత్రం మీ కళ్లు తిరుగుతాయి.
ఈ వ్యక్తి తన కనుపాపలను పూర్తిగా కళ్ళ నుంచి బయటకు తీస్తారు. ఇలా చేస్తున్న ఆయన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. ఇందులో ఆయన ఈ ఫీట్ చేయడం చూడవచ్చు. ఇలాంటి ఫీట్స్ చాలా మంది చేశారు. ఇందులో మహిళ కూడా ఉన్నారు. వాళ్ల ఫీట్స్ చూస్తే మాత్రం భయపడటం ఖాయం.
సిడ్నీ డి కార్వాల్హో అనే వ్యక్తి తన కనుగుడ్లను పూర్తిగా బయటకు తీయగలరు. వాస్తవానికి, ఇది ఒక అరుదైన పరిస్థితి, దీని కారణంగా సిడ్నీ డి కార్వాల్హో చేయగలరు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం బ్రెజిల్‌లోని సావో పాలో రికార్డు తిరగరాశారు. ఆప్టోమెట్రిస్ట్ సిడ్నీ డి కార్వాల్హో కంటి విస్తరణను ప్రోప్టోమీటర్ అనే పరికరంతో కొలిచారు. సిడ్నీకి 2023 ఎడిషన్లో చోటు కల్పించింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.
వాస్తవానికి, సిడ్నీ తన ముఖ కండరాలను ఉపయోగించి ఈ ఫీట్ చేస్తారు. సిడ్నీ తన కనుగుడ్లను 1.8 సెం.మీ వరకు బయటకు తీయగలరు. రికార్డు సృష్టించిన తర్వాత తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పారు. ఇది ఒక కల సాకారమైనట్లే అని ఆయన అన్నారు.
సిడ్నీ డి బ్రెజిల్ దేశం నివాసి. స్వచ్ఛంద గ్లోబ్ లక్సేషన్ కారణంగా తమ కళ్ళను చాలా బయటకు తీయగలుగుతారు. ఇది అరుదైన మెడికల్ మిరాకిల్. సిడ్నీ డే తనకు 9 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అద్దం ముందు తన ముఖాన్ని చూస్తూ తన అద్వితీయ ప్రతిభ గురించి తెలుసుకున్నానని చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, సిడ్నీ డే 2007లో 1.2 సెం.మీ.
Source: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్ సైట్ నుంచి ఈ వీడియో, స్టోరీని తీసుకున్నాము.