Viral Video: ఎగురుతున్న ఫ్లైట్‌లో నగ్న నిరసన - వెనక్కి తిప్పాలని డిమాండ్ - వైరల్ గా మారిన వీడియో
Flight: ఎగురుతున్న విమానంలో ఓ మహిళ హంగామా చేశారు. ఫ్లైట్ ను వెనక్కి తిప్పాలని డిమాండ్ చేశారు. బట్టలన్నీ విప్పేసి నానా హంగామా చేశారు. మరి ఫ్లైట్ ను వెనక్కి తిప్పారా?

Woman Strips Naked On US Flight: విమానాల్లో చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్ పాటిస్తారు. భద్రత పరంగా సున్నితమైన విషయాల పట్ల ఇంకా కఠినంగా ఉంటారు. అందుకే ఫ్లైట్ ఎక్కేటప్పుడు గుండు సూది ఉన్నా ఒప్పుకోరు. కానీ కొంత మంది రచ్చ చేయాలనుకుంటే.. వారి దుస్తులతోనే చేయవచ్చు. ఈ విషయాన్ని అమెరికాలోని ఓ మహిళ నిరూపించింది.
అమెరికాలోని హూస్టన్ నుండి ఫీనిక్స్ వెళ్లే విమానంలో ఒక మహిళ హఠాత్తుగా నగ్నంగా మారి గొడవ చేయడం ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు హడలిపోయారు. ఏం చేస్తుందోనన్న భయంతో వీడియోలు తీశారు. విలియం పి హాబీ విమానాశ్రయం నుండి విమానం 733 టేకాఫ్ కోసం టాక్సీయింగ్ ప్రారంభించిన సమయంలో ఈ సంఘటన జరిగింది.
NEW: Woman takes off all her clothes on a Southwest plane in Houston, demands to be let off.
— Collin Rugg (@CollinRugg) March 7, 2025
The woman reportedly ran around the plane for 25 minutes "before action was taken" according to ABC 7.
After nearly half an hour, the plane finally made it back to the gate before the… pic.twitter.com/U0F0l4HEJJ
వైరల్ అయిన వీడియోలో ఉన్న మహిళ తన దుస్తులన్నీ తొలగించి ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ తిరుగుతూ దాదాపు 25 నిమిషాల పాటు హంగామా చేశారు. కాక్‌పిట్ తలుపును తట్టడం , విమానాన్ని వెనక్కి తిప్పాలని డమాండ్ చేయడం చేశారు.
🚨🇺🇸WOMAN STRIPS NAKED, SCREAMS ON SOUTHWEST FLIGHT—NO CHARGES FILED
— Mario Nawfal (@MarioNawfal) March 6, 2025
A Southwest flight from Houston to Phoenix was forced back to the gate after a woman stripped naked and walked the aisle screaming as the plane taxied.
Passengers described the scene as terrifying as the woman… pic.twitter.com/Dckjsxjbt0
ఆమె విమానం గాల్లోకి ఎగరక ముందే రన్ వే మీద పరుగు అందుకుంటున్న సమయంలోనే తాను దిగిపోతానని గొడవ చేశారు. పట్టించుకోకపోవడంతో విమానం కదులుతూనే ఉండగా, ఆమె తన దుస్తులను విప్పడం ప్రారంభించింది. చాలా సేపటి వరకూ అలాగే చేయడంతో పైలట్.. ఎందుకైనా మంచిదని .. తిరిగి వెనక్కి వచ్చింది. ఆమెను అక్కడ దించేసి.. కాస్త ఆలస్యంగా మిగిలిన ప్రయాణికుల్ని వారి గమన్యస్థానాలకు చేర్చారు.
పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని గుర్తించినట్లుగా తెలుస్తోంది.
The woman stripped naked and caused chaos on the Southwest flight due to a mental health crisis, with multiple passengers and authorities citing a mental breakdown as the primary cause. She shouted she was bipolar during the incident, and Houston police confirmed she received a…
— IredcapI (@IredcapI) March 6, 2025




















