ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే యువతి రిజైన్- తప్పో ఒప్పో చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకక చాలా మంది రోడ్లు మీద తిరుగుతున్నారు. తీరా ఉద్యోగం సంపాదించిన తర్వాత జీతం సరిపోక కొంతమంది, అభివృద్ది లేక కొంత మంది దానిని వదులుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకక చాలా మంది రోడ్లు మీద తిరుగుతున్నారు. తీరా ఉద్యోగం సంపాదించిన తర్వాత జీతం సరిపోక కొంతమంది, అభివృద్ది లేక కొంత మంది దానిని వదులుకుంటున్నారు. మరి కొంత మంది చిన్నదో, పెద్దదో ఏదోకటిలే అని సర్దుకుపోతున్నారు.
మరి కొంత మంది పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయని ఉన్న దాని నుంచి తప్పుకుంటుంటారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని కేవలం మూడు రోజుల్లోనే వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చాయంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కేవలం బాస్ తో సరిపడక ఓ మహిళ ఉద్యోగం వదులుకుంది. అది కూడా కేవలం మూడు రోజులకే.
దీనికి సంబంధించిన విషయం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఆ మహిళ జరిగిన విషయాన్ని మొత్తం పంచుకుంది. ఆమె కేవలం మూడు రోజులకే ఉద్యోగం మానేయడం వల్ల ఆమెను అనేక మంది చాలా ప్రశ్నలు వేశారంట. అవి ఏమిటంటే మీరు అక్కడ ఉద్యోగం ఎందుకు మానేశారు? మీరు ఏమైనా తప్పు చేశారా? అందుకే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారా? అంటూ ఇలా చాలా రకాల ప్రశ్నలు ఆమెకు ఎదురయ్యాయి.
అందుకే వాటికి అన్నింటికి ఆమె వివరణ ఇస్తూ అసలు జరిగిన విషయాన్ని అంతటిని కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అసలు ఆమె చెప్పిన కారణం వింటే ఎవరైనా కూడా ఏంటి ఇది కూడా ఒక కారణమా? అంటూ నోరెళ్లబెడుతున్నారు.
ముందుగా ఆ మహిళతో తన బాస్ మాట్లాడుతూ..మీరు ఈ సంస్థలో పని చేయలేరు అని అన్నారంట. ఎందుకు అని మహిళ ప్రశ్నించగా మీరు బాత్ రూమ్ లో 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు గడుపుతున్నారని బాస్ సమాధానమిచ్చారని ఆమె పేర్కొంది.
అంతే కాకుండా ఉద్యోగం లో చేరకు ముందు ఆమె ఎదుర్కొన్న కొన్ని అనారోగ్య సమస్యల గురించి కూడా ఆమె బాస్ తో చెబితే బాస్ చాలా వెటకారంగా మాట్లాడారని వివరించింది. ఒక బాస్ ఉద్యోగితో మాట్లాడే విధానం ఇదేనా అని ఆమె ఆ సమయంలోనే ఫీల్ అయినట్లు వివరించింది.
అయితే నేను చేరి మూడు రోజులు గడిచినప్పటికీ కూడా బాస్ తనకు పని అప్పగించకపోగా..తన తోటి ఉద్యోగి చేసే పనినే చేయమన్నట్లు వివరించింది. దీంతో విసుగు చెందిన మహిళ బాస్ తనను అర్థం చేసుకోలేకపోతున్నాడు అన్న కారణంతో కేవలం మూడు రోజులకే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినట్లు వివరించింది.
పని గురించి అడిగిన బాస్ సీరియస్ అయ్యాడని... అసలు ఉద్యోగం చేయాలో లేదో డిసైడ్ చేసుకోవడానికి రెండు రోజుల సమయం ఇచ్చినట్టు ఆమె వివరించారు. అయితే అప్పటికే బాస్ చేసిన పనికి విసిగిపోతున్న ఆమె... అంత టైం అవసరం లేదని... ఈ క్షణమే రాజీనామా చేస్తున్నట్టు ఆయనకు చెప్పేసిందట.
ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆమె. తాను చేసింది తప్పా అని ప్రశ్నించారు. అయితే దీనికి చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఆమె చేసింది తప్పే కాదని వ్యక్తిగత స్వేచ్ఛ లేని చోట పని చేయడం ఎందుకని కొందరు ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాలపై కామెంట్ చేసే ఆయన వద్ద మిగతా ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా వచ్చిన కామెంట్స్‌లో చాలా మంది ఆమెకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.