688 Year Old Murder Case: 688 ఏళ్ల కిందట మర్డర్ - ఇప్పుడు కేసు రీఓపెన్ - హంతకురాల్ని కూడా గుర్తించారు!
Viral News: హత్య జరిగినప్పటికీ ఆధారాల్లేక ఓ కేసును మూసి వేశారు. కానీ 688 ఏళ్ల తర్వాత రీఓపెన్ చేశారు. హంతకురాల్ని గుర్తించారు.

Woman kill a priest 688 year old murder case: హత్య జరిగిన పదేళ్ల తర్వాత నిందితుల్ని పట్టుకోకపోతే అందరూ మర్చిపోతారు. కానీ అప్పుడప్పుడూ పాతికేళ్ల తర్వాత పట్టుబడ్డ హంతకుడు.. యాభై ఏళ్లకు దొరికిన మర్డరర్ అని వార్తలు వస్తూ ఉంటాయి. కానీ లండన్ లో 688 ఏళ్ల తర్వాత హంతకురాల్ని గుర్తించారు.ఆమె ఉండదు కాబట్టి శిక్షల ప్రస్తావన రాదు. కానీ కేసును చేధించారు. 1337లో లండన్‌లో జాన్ ఫోర్డ్ అనే చర్చి ఫాదర్ హత్య జరిగింది. అప్పట్లో సాక్ష్యాలు లేక కేసును మూసివేశారు. ఇటీవల కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని క్రిమినాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ మాన్యుయెల్ ఐస్‌నర్ మిడీవల్ మర్డర్ మ్యాప్స్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆ కేసు పత్రాలను పరిశీలించారు. దీనిలో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
1337లో ఇంగ్లాండ్ హింసాత్మకంగా ఉండేది. ఆక్స్‌ఫర్డ్‌లో హత్యలు చాలా కామన్. లక్ష మంది జనాభా ఉంటే 60 నుంచి 75 హత్యలు జరిగేవి. ఏ చిన్న గొడవ జరిగినా చంపుకుంటూ ఉంటారు. లండన్‌లోని ఒక చర్చి సమీపంలో జాన్ ఫోర్డ్ అనే పాస్టర్ ను కొంతమంది వ్యక్తుల బృందం పొడిచి చంపింది. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని జైలులో పెట్టారు. అయితే వారు కిరాయి హంతకులు. అసలు హత్యకు ప్రణాలిక వేసింది ఎలా ఫిట్జ్‌పేన్ అనే మహిళ అని అనుమానించారు. కానీ ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించలేకపోయారు.
ఎలా ఫిట్జ్‌పేన్ అనే మహిళ పాస్టర్ జాన్ ఫోర్డ్‌తో సహజీవనం చేసింది. ఎలా ఉన్నత వర్గానికి చెందిన మహిళ. ఇద్దరూ కలిసి నేరాలు చేశారు. 1332లో, క్యాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ సైమన్ మెఫామ్ ఎలా ఫిట్జ్‌పైన్‌ను వ్యభిచారం ఆరోపణలతో శిక్షించారు. ఆమెకు అవమానకరమైన శిక్షలు విధించారు. ఆ శిక్షను "వాక్ ఆఫ్ షేమ్"గా పేర్కొంచారు. ఫిట్జ్‌పైన్ ఈ శిక్షలను పాటించలేదని చర్చి నుండి బహిష్కరించారు. అయితే తనను ఇరికించి ఫోర్డ్ తప్పించుకున్నాడని ఆమె పగబట్టింది. కిరాయి హంతకులతో హత్య చేయించింది. కానీ ఆధారాలు కనిపించకుండా జాగ్రత్తపడింది.
జ్యూరీ హంతకులను గుర్తించింది కానీ వారి ఆచూకీ తెలియదని పేర్కొంది. ఈ హత్యలో ఫిట్జ్‌పైన్ కుటుంబం పాల్గొన్నట్లు స్పష్టంగా తెలిసినప్పటికీ ఉన్నతవర్గ సంబంధాలు, వర్గ ఆధారిత న్యాయ వ్యవస్థ కారణంగా న్యాయం అమలు కాలేదని భావిస్తున్నారు. హంతకులలో ఒక్కడైన హ్యూ కోల్న్ 1342లో న్యూగేట్ జైలులో శిక్ష అనుభవించాడు. ఎలా ఫిట్జ్‌పైన్ , ఆమె సోదరుడు హ్యూ లోవెల్ ఎటువంటి శిక్షకు గురి కాలేదు. 2018లో ప్రారంభమైన 14వ శతాబ్దంలో లండన్, ఆక్స్‌ఫర్డ్, యార్క్ నగరాల్లో జరిగిన హత్యలు , అసహజ మరణాల పరిశీలన ప్రాజెక్టులో భాగంగా చూశారు.
కొన్ని నివేదికలో ఫిట్జ్‌పైన్, ఆమె భర్త, ఫోర్డ్ ఫ్రెంచ్ ప్రియోరీపై దాడి చేసిన వివరాలు ఉన్నాయి. ఈ రికార్డులు హత్య సంఘటన, హంతకుల గుర్తింపు, ఫిట్జ్‌పైన్‌తో వారి సంబంధాన్ని తెలిపేలా ఉంటాయి. ఈ రికార్డులు డిజిటల్ రూపంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిది. దీన్ని కేవలం ఓ హత్య కేసుగా కాకుండా.. అప్పటి ఇంగ్లాండ్ స్థితిగతుల్ని విశ్లేషించే కేస్ స్టడీగా మారింది.





















