Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు
తన ప్రియుడు మోసగాడని ఓ లవర్ పుల్ పేజీ యాడ్ ఇచ్చింది. ఇప్పుడా యాడ్ వైరల్ అవుతోంది. ఈ ప్రేమ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి.
Revenge Lover : ఓ అమ్మాయిని ప్రేమించామని చెప్పడానికి వినూత్నంగా ప్రయత్నించే అబ్బాయిలు చాలా మంది ఉంటారు. గోడల మీద రాయడం.. పోస్టర్లు అంటించడం.. ఆన్‌లైన్‌లో ప్రకటించడం .. ఇంకా డబ్బున్న బ్యాచ్ కుర్రాడైతే.. విమానం తోకకు ఐ లవ్ యు అని లవర్ పేరు రాసి ప్రదర్శించడం వంటివి చేస్తూంటారు. అయితే ప్రేమిస్తేనేనా... కోపమొస్తే అలా చేయరా అనే- డౌట్ చాలా మందికి వచ్చి ఉండదు. ఎందుకంటే కోపం వస్తే.. తిట్టేసుకుని .. కొట్టేసుకుని విడిపోయే ప్రేమికులే ఎక్కువగా ఉంటారు. కానీ ఆస్ట్రేలియాలోని ఆ లవర్ మాత్రం ఆ టైప్ కాదు. అందుకే తన ప్రియునిపై పగ సాధించింది.
‘‘ప్రియమైన స్టీవ్, మీరు ఆమెతో సంతోషంగా ఉన్నావని నేను ఆశిస్తున్నాను. నువ్వు ఎంత నీచమైన మోసగాడివో ఇప్పుడు ఊరందరికీ తెలిసిపోతున్నది.. జెన్నీ’’ ..ఆస్ట్రేలియాలో ఓ పత్రికలో వచ్చిన ఫుల్ పేజీ యాడ్‌లో ఉన్న విషయం ఇదే. చూస్తే అర్థమైపోతుంది. జెన్నీని ఆమె ప్రియుడు స్టీవ్ మోసం చేసి వెళ్లిపోయాడు. వేరే లవర్‌తో కలిసి ఉంటున్నారు. ఈ కోపం జెన్నీ ప్రదర్శించాలనుకుంది. స్టీవ్ గురించి అందరికీ తెలిసేలా చేయడంతో పాటు తన కోపం చల్లార్చుకోవాలనుకుంది. అందుకే ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది.
Hell hath no fury like a woman scorned… Jenny bought a full-page ad space in today’s Mackay & Whitsunday Life independent paper using her (ex?) partner’s credit card. The local paper says they’ve been inundated with messages about Page 4 and do not know who Steve is @9NewsAUS pic.twitter.com/x9LmgRLozl
— Olivia Grace-Curran (@livgracecurran) August 12, 2022
జెన్నీ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటనను చదివిన చాలా మంది స్టీవ్ ఎవరు.. జెన్నీ ఎక్కడుంటుంది.. అనే విషయాలను ఆరా తీసేందుకు వారపత్రిక కార్యాలయానికి ఫోన్ చేస్తున్నారు. కానీ ఆ పత్రిక వివరాలేం చెప్పడం లేదు. కానీ స్టీవ్ కి.. ఆయనకు తెలిసిన వారికి.. జెన్నీకి.. జెన్నీ సన్నిహితులకు అందరికీ విషయం తెలిసిపోతుంది. మెల్లగా లోకల్‌గా ఒక్కొక్కరు చెప్పుకుంటారు. జెన్నీకి కావాల్సింది కూడా అదే.
అయితే ఎంత ప్రేమికుడు వెళ్లిపోతే మాత్రం కోపంతో ఇంత ఖర్చు పెట్టుకుంటారా.. ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి లక్షలు వృధా చేసుకుంటారా అని.. చాలా మంది సానుభూతి చూపిస్తారేమో.. కానీ జెన్సీ అంత తెలివి తక్కువదేమీ కాదు. స్టీవ్ గుక్కపెట్టి ఏడ్చేలా అక్కడే ట్విస్ట్ ఇచ్చింది.ఈ పేపర్ ప్రకటనకు అయిన ఖర్చుని స్టీవ్ క్రెడెట్ కార్డు నుంచే చెల్లించింది. పాపం స్టీవ్ ఇప్పుడు... పీక్కోలేక.. లాక్కోలేకపోతూంటాడు. అంతే.. మగవాళ్లకు ప్రేమ కలిగనా.. ఆడవాళ్లకు కోపం వచ్చినా ఖర్చు ఒకరిదే..!