అన్వేషించండి

YEAR ENDER 2023: ఈ ఏడాది బెస్ట్‌ టూరిస్ట్‌ ప్లేసులు ఇవే- నెంబన్ వన్ సిటీ ఏంటంటే! మీరూ వెళ్లారా

2023 ఎండింగ్‌కు వచ్చేసింది. మరి ఈ ఏడాదిలో ఎక్కువ మంది ఎంచుకున్న టూరిస్ట్‌ ప్లేస్‌ ఏదో తెలుసా? ప్రతిసారి మొదటి ప్లేస్‌లో ఉండే బ్యాంకాక్‌ను వెనక్కు నెట్టి.. ఫస్ట్‌ ప్లేస్‌లో చేరిన ఏరియా తెలుసుకుందామా.

World Best Tourist Place in 2023: టూర్‌.. బిజీబిజీ లైఫ్‌లో చాలా ముఖ్యమైనది. అన్ని పనులు పక్కనపెట్టి ప్రకృతిని ఆస్వాదించేందుకు చాలా మంది టూర్‌లకు వెళ్తుంటారు. కొంత మంది వారి వారి స్థోమత ఆధారంగా... దేశం వరకే పరిమితమవుతారు. కొంతమంది విదేశీ టూర్‌లకు వెళ్తారు. విదేశీయులు మన దేశంలోని పర్యాటక ప్రాంతాలకు వస్తుంటారు. ఇలా ఎవరి లెక్క వారిది... ఎవరి ఇష్టం వారిది. ప్రపంచం మొత్తం మీద పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒక్క ప్రదేశానికి ఒక్కో గుర్తింపు ఉంటుంది. వేటి అందాలు వాటివే.

మన దేశంలోనూ ఇలాంటి పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. విదేశాల నుంచి ఎక్కువగా పారిస్, బ్యాంకాక్ వంటి ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారు. అయితే 2023 సంవత్సరంలో ఎక్కువ మంది పర్యాటకులు ఎక్కడికి వెళ్లారో మీకు తెలుసా. ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీలు... ప్రజలు ఎక్కువగా సందర్శించే దేశాలకు సంబంధించిన డేటాను విడుదల చేస్తాయి. ఈ ఏజెన్సీలు ఏడాది పొడవునా పర్యాటకుల సమాచారాన్ని సేకరించి ఒక జాబితా తయారు చేస్తాయి. వాటి ప్రకారం ఏ ఏడాది ఏది బెస్ట్‌ అని తెలుస్తుంది. 

గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం... 2023లో ఎక్కువ మంది ప్రజలు వెళ్లిన టూరిస్ట్‌ ప్లేస్‌లో హాంకాంగ్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం చాలా మంది హాంకాంగ్‌ను విజిట్ చేశారు. గతేడాది థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది బ్యాంకాక్‌ కంటే బెస్ట్ ప్లేస్ గా వేరే ప్రాంతాన్ని సందర్శించారు. నివేదిక ప్రకారం... ఈ సంవత్సరం సుమారు 26.6 మిలియన్ల మంది అంటే 2 కోట్ల 66లక్షల మంది హాంకాంగ్‌ను సందర్శించారు. 

ఆ రేంజ్ లో టూరిస్టులు ఎందుకు హాంకాంగ్‌కు ఎంచుకున్నారు. హాంకాంగ్‌లో ప్రత్యేకత ఏమిటి..? హాంకాంగ్‌లో చాలానే ప్రత్యేకలు ఉన్నాయి. హాంకాంగ్‌లో డిస్నీల్యాండ్ అత్యంత ప్రసిద్ధ చెందిన ప్రదేశం. రెండోది విక్టోరియా శిఖరం... ఇది నగరాన్ని సందర్శించడానికి అనుకూల ప్రదేశం. హైనాన్ ద్వీపంలో పెద్ద బుద్ధుడి విగ్రహం చూపరులను ఆకర్షిస్తుంది. ఇక నాలుగోది మోంగ్ కోక్‌లోని రద్దీ వీధులు, మార్కెట్లు. ఇక ఐదోది సింఫనీ ఆఫ్ లైట్స్‌... చూస్తుంటే అద్భుతం, రెండు కళ్లు చాలవు అన్నట్టు వెలుగులు జిమ్ముతుంటాయి. వీటితోపాటు హాంకాంగ్‌లోని చారిత్రిక మ్యూజియం... ఇవే కాదు హాంకాంగ్‌లో చూసేందుకు ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి.

బెస్ట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ జాబితాలో బ్యాంకాక్ రెండో స్థానంలో నిలచింది. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో బ్యాంకాక్ నగరం రెండోదిగా నిలిచింది. ఈ ఏడాది (2023)లో 21.2 మిలియన్ల మంది అంటే 2 కోట్ల 12లక్షల మంది బ్యాంకాక్‌ను సందర్శించారు. అంతేకాదు... చాలా మంది ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఐదుసార్లు సందర్శించిన నగరంగా బ్యాంకాక్‌ రికార్డ్‌ సృష్టించింది.

ఈ జాబితాలో మూడోది లండన్. 2023లో దాదాపు 19.2 మిలియన్ల మంది అంటే కోటి 92 లక్షల మంది లండన్‌ను సందర్శించారని అంచనా. బ్రిటన్‌లోని లండన్‌ నగరం హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ స్టార్లకు కూడా ఇష్టమైన నగరం. 2025 నాటికి 25 మిలియన్ల మంది ఇక్కడికి రావచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ జాబితాలో సింగపూర్ నాలుగో స్థానం దక్కించుకుంది. 2023లో 16.6 మిలియన్లు అంటే కోటి 66లక్షల మంది విదేశీ పర్యాటకులు సింగపూర్‌ను సందర్శించారు. ఈ ఏడాది మాత్రమే కాదు... ప్రతి సంవత్సరం దాదాపు 16 మిలియన్ల మంది సింగపూర్‌ను సందర్శిస్తుంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
Embed widget