అన్వేషించండి

Viral News: యువతిని 14 ఏళ్లపాటు గదిలో బంధించిన సైకో, వెయ్యి సార్లు అత్యాచారం - అరెస్ట్ చేసిన పోలీసులు

Viral News: రష్యాలో ఓ సైకో 14 ఏళ్ల పాటు యువతిని బంధించి వెయ్యి సార్లు అత్యాచారం చేశాడు.

Viral News: 


14 ఏళ్ల పాటు చిత్రహింసలు..

రష్యాలో 14 ఏళ్ల పాటు ఓ అమ్మాయిని గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లలో ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా దాదాపు వెయ్యి సార్లు అత్యాచారం చేసినట్టు బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. నిందితుడు వ్లాదిమిర్ చెస్కిడోవ్‌ మరి కొంత మహిళలనూ ఇలాగే టార్చర్ చేశాడని విచారణలో తేలింది. 19 ఏళ్ల వయసులో బాధితురాలు చెస్కిడోవ్ ఇంటికి నీళ్లు తాగేందుకు వెళ్లింది. అప్పుడే ఆమెని లోబరుచుకుని గదిలో బంధించాడు. అప్పటి నుంచి దారుణంగా హింసిస్తున్నాడు. ఈ నిందితుడికి తల్లి కూడా సహకరించింది. ఇద్దరూ కలిసి ఆమెను వేధించారు. ఇన్నేళ్లకు ఎలాగోలా ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చింది బాధితురాలు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడితో పాటు అతడి 72 ఏళ్ల తల్లినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు కీలక వివరాలు వెల్లడించింది బాధితురాలు. 2009లో బస్‌డిపోలో ఉండగా నిందితుడు చెస్కిడోవ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తరవాత ఇద్దరూ స్నేహితులయ్యారు. డ్రింక్స్ పార్టీ ఉందని చెప్పి అమ్మాయిని ఆహ్వానించాడు నిందితుడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే కత్తితో బెదిరించి గదిలో కట్టేశాడు. బెడ్‌రూమ్‌లో బంధించాడు. కేవలం వంట చేయడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి మాత్రమే గదిలో నుంచి బయటకు వచ్చేది. అప్పుడు కూడా పక్కనే కత్తి పట్టుకుని నిలబడి ఉండేవాడని పోలీసులకు చెప్పింది బాధితురాలు. 

"ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ నా నోరుకి టేప్ వేసేవాడు. గదిలో మంచానికి కట్టేసి వెళ్లిపోయేవాడు. ఎక్కడికీ పారిపోకుండా కత్తి పట్టుకుని వెంటే వచ్చే వాడు"

- బాధితురాలు 

పారిపోయి వచ్చిన బాధితురాలు..

నిందితుడుని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. తాను అత్యాచారం చేశానన్న  మాట అవాస్తవమని, ఆమెపై ఎంతో ప్రేమ ఉందని కోర్టుకి చెప్పాడు నిందితుడు. అయితే..నిందితుడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు అభ్యంతరకరమై వీడియో సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక సెల్లార్‌లో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. దీనిపై విచారించగా...2011లో చెస్కిడోవ్ ఓ మహిళను హత్య చేశాడని బాధితురాలు చెప్పింది. బాడీని డీకంపోజ్ చేయడానికి సాయం చేయాలని బలవంతం చేశాడని వివరించింది. ఆ చనిపోయిన మహిళ మరెవరో కాదని, అతడి భార్యేనని వెల్లడించింది. తాను ఎలా తప్పించుకుని వచ్చిందో కూడా వివరించింది. నిందితుడు మద్యం మత్తులో వింతగా ప్రవర్తిస్తుంటే అతని తల్లి ఆంబులెన్స్‌కి కాల్ చేసింది. ఆ హడావుడిలో ఇంటికి తాళం వేయడం మరిచిపోయింది. ఇది గమనించిన బాధితురాలు వెంటనే అక్కడి నుంచి పారిపోయి పక్కనే ఉన్న తన గ్రామానికి వెళ్లిపోయింది. తన చెల్లిని కలిసింది. దాదాపు 14 ఏళ్ల తరవాత ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన బాధితురాలు ఉన్నట్టుండి కళ్ల ముందుకు వచ్చే సరికి ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఈ  సంఘటన సంచలనం సృష్టించింది. 

Also Read: Haryana Clashes: హరియాణాలో ఇంకా తగ్గని అలజడి, ఇంటర్నెట్‌ సర్వీస్‌లు బంద్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
Sridevi Drama Company Latest Promo: శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
Amardeep Chowdary: అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
Embed widget